బరువు తగ్గాలంటే కచ్చితంగా జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేయాలి. లేదా వాకింగ్, జాకింగ్ లాంటివి చేయాలి. అంతేకాదు.. నోరు కట్టేసుకొని డైట్ ఫాలో అవ్వాలి. ఇది చాలా మంది ఫాలో అయ్యే వెయిట్ లాస్ ప్రాసెస్ ఇదే. అయితే.. ఇదంతా ఏమీ అవసరం లేదు. కేవలం నిలబడితే చాలు అంటున్నారు నిపుణులు. మీరు చదివింది నిజమే.. బరువు తగ్గడానికి పరిగెత్తాల్సిన పనిలేదు. నిలబడినా చాలని పరిశోధకులు చెబుతున్నారు.

ఉదయం, సాయంత్రం జిమ్ లో వర్కౌట్స్ చేసి బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. కానీ.. తీరా ఆఫీసుకి వెళితే.. కూర్చున్న కూర్చీలో నుంచి కూడా కదలరు. దీని వల్ల పెద్ద లాభమేమీ లేదు. ఆరు గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చునే బదులు.. నిలబడితే బరువు సులభంగా తగ్గవచ్చు. నిలబడటం ద్వారా నిమిషానికి 0.15 క్యాలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే రోజులో 6గంటలు నిలబడితే 143.3 పౌండ్ల బరువు సులభంగా తగ్గవచ్చని సూచిస్తున్నారు.

కేవలం క్యాలరీలు ఖర్చుకావడమే కాదు.. మజిల్ యాక్టివిటీ కూడా పెరుగుతందని చెబుతున్నారు. ఎక్కువ సేపు నిలబడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చనేది నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన పలువురు పరిశోధకులు దాదాపు 1184మందిపై 46పరిశోధనలు చేసి.. ఈ విషయాలు వెల్లడించారు.