Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి దారిచ్చిన స్టాలిన్

జయలలిత పోయాక,  కరుణానిధి తప్పుకున్నాక తమిళనాడు రాజకీయాలు ఇపుడు  ఇలా  మర్యాదగా సాగుతున్నాయి

DMK Stalin convoy stops to give way to CM pannerselvam convoy

ఎఐఎడిఎంకె నేత జయలలిత చనిపోవడం, డిఎంకె పెద్దాయన రిటైర్ కావాలనుకోవడం...తమిళనాడు రాజకీయాల స్వభావాన్ని పూర్తి గా మార్చేసింది.

 

జయలలితకు మెరీనాబీచ్ లో డిఎంకె ఇచ్చిన నివాళి రాజకీయాలను చాలా మర్యాద మయం చేశాయి. రెండు  పార్టీల మధ్య మునుపటి శత్రుత్వం కనిపించడం లేదు. ఆ స్థానంలోకి హుందాతనం, పరస్పర గౌరవం చేరుకుంటున్నాయి. దీనికి తాజా ఉదాహరణ చెన్నైలో జరిగింది.

 

ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కాన్వాయ్ కి  ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ పక్కకు వైదొలగి దారీయడం.

 

 వారిద్దరి మధ్య గత కాలపు శత్రుత్వం చూస్తే ఇది చాలా  మార్పులా కనిపిస్తుంది.  2015లో ఎన్నికలకు ముందు వారిద్దరి లేఖ ల యుద్ధం నడిచింది. స్టాలిన్ చాలా ఘాటుగా అప్పడు కూడా ముఖ్యమంత్రి అయిన పన్నీర్ సెల్వాన్ని చాలా అవమానపర్చేవారు. ఒక బహిరంగ లేఖ రాస్తూ నువ్వేం  ఆఫీస్ లేని సిఎం వినువ్వు అని అన్నారు.

 

“You (Panneerselvam) are interested only in the welfare of your leader. Have you and your ministerial colleagues no sense of responsibility? Do you not realise that people had voted for you with hopes in their heart for a better future for them, their sons and daughters? Have you no sense of shame or regret for letting them down, for destroying their lives and their children’s future, all for the sake of your convicted leader?” అని రాశారు.

 

ఇపుడు చూడండి ఏమిజరిగిందో.

 

అసెంబ్లీ కి వెళ్లేందుకు స్టాలిన్‌ బయలుదేరారు.తెలుసుకదా, నేత బయలు దేరితే ఎలా ఉంటుందో.  కారు సీఆర్‌పీఎఫ్‌ భద్రతా సిబ్బంది, అనేక మంది ఎమ్మెల్యేల వాహనాలు వెనకా... చాలా హంగామాతో ఆయన బయలెళ్లారు.  ఆపుడే ఆళ్వారుపేట  ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం కాన్వాయ్‌ అదే దారిలోకి మళ్లింది. ఆయన కు సిబ్బంది ఈ విషయం చెప్పారు. మొండిగా పోనీయండి అనకుండా, హుందాగా, తన వాహనాన్నిపక్కకు తీసుకోవాలని చెప్పారు. తన వెనక వస్తున్న అదే సలహా ఇచ్చారు. వారి వాహనాలన్నీ పక్కకు వచ్చి ఆగిపోవడంతో

 

ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ కాన్వాయ్‌ నిరాటంకంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత స్టాలిన్‌, శాసనసభ్యుల కార్లు అసెంబ్లీ వైపు కదిలాయి.  

 

ఈ మర్యాద ఎంత కాలం ఉంటుందో చూడాలి. ఎందుకంటే, తన బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని కోరాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios