Asianet News TeluguAsianet News Telugu

సొంతింటికలను నిజం చేసే లోన్స్ ఇవి..

  • ఇప్పటికే ఉన్న మీ ఇంటికి పునరుద్థరణ పనులు చేపట్టాలనుకుంటే.. అప్పుడు ఈ హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ ని ఆశ్రయించవచ్చు. మీరు హోమ్ లోన్స్ కోసం తీసుకున్న మొత్తాన్ని పూర్తి చెల్లించినట్లయితే.. అలా చెల్లించిన సంవత్సరం లోపు ఈ హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ తీసుకోవచ్చు.
Different Kinds Of Home Loans Available To You

సొంతిల్లు.. ఇది ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో హోమ్స్ లోన్స్ ద్వారా సొంతింటి కల నేరవేర్చుకోవడం చాలా సులువు. మరి ఎలాంటి హోమ్ లోన్ తీసుకోవాలి. అసలు హోమ్ లోన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి.. మీ బడ్జెట్ కి లోబడి ఎలాంటి హోమ్ లోన్ తీసుకోవాలి? ఈ సమాచారం ఇప్పుడు చూద్దాం..

ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్స్..

ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ తో హోమ్ లోన్స్ తీసుకోవడం చాలా కామన్. ఈ రకం హోమ్ లోన్ తీసుకుంటే.. దాని వడ్డీ రేటు.. బ్యాంకు బేస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ రేట్లలో వచ్చే మార్పులకు తగినట్టు బ్యాంకుల బేస్ రేటు మారుతుంది. ఆ బేస్ రేటు బట్టి హోమ్ లోన్ ఇంట్రస్ట్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఫిక్స్డ్ రేట్ లోన్స్ తో పోలిస్తే.. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ హోమ్ లోన్స్ చౌకగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది రుణ గ్రహితలు ఈ లోన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. ఈ రకం లోన్స్ లో ఈఎంఐ విధానం ఉండదు. ఎందుకంటే.. ఈ లోన్స్ ఇంట్రస్ట్ రేట్స్.. ఒక్కోసారి పెరుగుతూ.. మరోసారి తగ్గుతూ ఉంటాయి.

ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్స్..

ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తో హోమ్ లోన్స్ లో రుణ పదవీకాలంపై తేడాలు ఉండవు. ఈ రకం లోన్స్ లో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రోట్స్ కన్నా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ రకం  లోన్స్ లో ఈఎంఐ విధానం ద్వారా లోన్ చెల్లించే సౌకర్యం ఉంటుంది. ఈ రకం లోన్స్ లో ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం సులభం. నెల నెల లోన్ చెల్లించే మొత్తం స్థిరంగా ఉంటుంది.

ఫ్లెక్సీ హోమ్ లోన్స్...

ఫ్లోటింగ్, ఫిక్స్డ్ హోమ్ లోన్స్ కాంబినేషనే ఈ ఫ్లెక్సీ హోమ్ లోన్స్.  వడ్డీరేటు కొద్ది కాలం స్థిరంగా ఉంటుంది. మిగిలిన కాలంలో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ విధానం ద్వారా లోన్ చెల్లించవచ్చు. హోమ్ లోన్ కోసం తీసుకున్న మొత్తాన్ని చెల్లించే సమయంలో.. కొంత ఫ్లోటింగ్ విధానంలో, మరికొంత ఫిక్స్డ్ విధానంలో చెల్లించుకోవచ్చు. ఈ రకం హోమ్ లోన్స్ లో.. పెరుగుతున్న వడ్డీ రేట్లకు అడ్డుకట్ట వేయవచ్చు. రుణ గ్రహీతలు.. లోన్ చెల్లించే సమయంలో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లోటింగ్ లోన్ ని ఫిక్స్డ్ లోన్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే.. ఇలా ఎక్కువ సార్లు మార్చుకోవడానికిలేదు. లోన్ పూర్తయ్యే కాలంలో కేవలం ఒకసారి మార్చుకునే అవకాశం ఉంటుంది.

జాయింట్ హోమ్ లోన్స్..

గృహ రుణాన్ని పెంచుకోవడానికి ఈ జాయింట్ హోమ్ లోన్స్ ఉఫయోగపడతాయి. ఇందులో తల్లిదండ్రులు, భార్య, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లతో కలిసి లోన్ కి అప్లై చేస్తే లోన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ జాయింట్ హోమ్ లోన్స్ లో.. లోన్ చెల్లించే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణంతో పోలిస్తే.. ఈ రకం లోన్స్ లో  ఇంట్రెస్ట్ రేటు ఎక్కువగా ఉంటుంది.

ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్...

మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని లోన్ కోసం అప్లై చేసుకుంటే.. ఒక్కోసారి అవి రిజెక్ట్ అవుతుంటాయి. అలాంటి సమయంలో లోన్ రిజక్ట్ అవ్వకూడదు అనుకుంటే.. ఈ ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్ ని ఎంచుకోవాలి. ఈ ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్ కి అప్లై చేసుకుంటే..బ్యాంకులు హోమ్ లోన్స్ అందిస్తాయి. ఫిక్డ్స్ ఎమౌంట్ కి  బ్యాంకులు లోన్ అందజేస్తాయి. కాకపోతే.. ఈ రకం లోన్స్ కి గ్యారెంటీ చాలా తక్కువ.

గృహ నిర్మాణం కోసం రుణం..

ఇంటిని కోనుగోలు చేయడం కాకుండా.. సొంతంగా ఇంటిని కట్టుకోవాలనుకుంటే.. వాటికి నిధులు కావాలంటే.. కన్ స్ట్రక్షన్ లోన్ ని ఎంచుకోవాలి. ఈ రకం లోన్స్ లో.. ఒకేసారి ఇంటికి సరిపడా మొత్తాన్ని ఇవ్వకపోవచ్చు కానీ.. నిర్మణానికి జరుగుతున్న పనులను బట్టి అందజేస్తుంటాయి.రుణం తీసుకున్న 12నెలలోపు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.

టాప్ అప్ హోమ్ లోన్స్...

ప్రస్తుతం మీరు తీసుకొని ఉన్న లోన్ కి ఫినాన్స్ పెంచడానికి ఈ టాప్ అప్ హోమ్ లోన్స్ ఉపయోగపడతాయి. ఒక వేళ మీరు ఇంటికోసం రుణం తీసుకున్నారనుకుందాం.. తీసుకున్న లోన్ కనుక సరిపోకపోతే.. అదనంగా ఈ టాప్ అప్ లోన్స్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్స్ తో పోలిస్తే,.. ఈ టాప్ అప్ లోన్స్ లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి.

హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్...

ఇప్పటికే ఉన్న మీ ఇంటికి పునరుద్థరణ పనులు చేపట్టాలనుకుంటే.. అప్పుడు ఈ హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ ని ఆశ్రయించవచ్చు. మీరు హోమ్ లోన్స్ కోసం తీసుకున్న మొత్తాన్ని పూర్తి చెల్లించినట్లయితే.. అలా చెల్లించిన సంవత్సరం లోపు ఈ హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ తీసుకోవచ్చు. ఈ రకం లోన్ పొందడం చాలా సులభం.  ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువ. వడ్డీ రేట్లు కూడా తక్కువ.

కాబట్టి.. హోమ్ లోన్ కోసం అప్లై చేసేముందు.. వీటన్నింటి గురించి తెలుసుకొని ఆ తర్వాత.. ఏ రకం లోన్ అయితే మీకు ఉపయోగపడుతుందో దానిని ఎంచుకోండి.

 

అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

 

Follow Us:
Download App:
  • android
  • ios