కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏమిటో తెలుసా...
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మూత్సవాలు సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో సెప్టెంబరు 19వ తేదీన మంగళవారంనాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే...
కోయిల్ అంటే పవిత్రాలయం.ఆళ్వార్ అంటే భక్తులు. తిరుమంజనం అంటే పవిత్ర శుద్ది కార్యక్రమం.
కోయిల్ ఆళ్వార్ తిరుమంనం అంటే భక్తులచేత ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేయించడం లేదా శుభ్రం చేయించడం.
ఈ కార్యక్రమంలో అన్ని రకాల వస్తువును గర్భగుడి నుంచి తీసేసి సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో మూల విగ్రహానికి తడి సోకకుండా వాటర్ ప్రూఫ్ వస్త్రాలతో కపేస్తారు.
గర్భ గుడిలో నేల, పై కప్పు, గోడలు, ఇతర ఉపాలయాలు పూజాసామాగ్రి నీళ్లతోనూ, తిరుమంజనంతోనూ కడుగుతారు. తిరుమంజనం ద్రవ్యంలో కర్పూరం, కుంకుమ పువ్వు, పసుపు ల మిశ్రమం ఉంటాయి. ఇవన్నీ ఆలయంలోకి క్రిమికీటకాలు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.
ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఇందులో గర్భాలయం, ఉప ఆలయాలు, పోటులోని గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఆ తరువాత నామకోపు, శ్రీచూర్ణణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర తిరుమంజనాన్ని ఆలయం అంతటా పూస్తారు. భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.
