Asianet News TeluguAsianet News Telugu

దేశానికి వాతలు పడ్డాయి

నోట్ల రద్దుతో దేశానికి వాతలు పడినట్లు సెంట్రల్ స్టాటిస్టిటికల్ అర్గనైజేషన్ వారి లెక్కలు చెబుతున్నాయి.

demonetization likely to affect the economy

పెద్దనోట్ల రద్దు అర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ వేసింది.  అబ్బే  ఇది దాని దెబ్బ కాదు, అని  కేంద్ర ఆర్థిక మంత్రి బుకాయించడం వేరే విషయం.  

 

ఈ రెన్నెళ్లదెబ్బ దేశాన్ని రెండేళ్ల వెనక్కి తీసుకువెళ్లిందని  ఎవరో కాదు, కేంద్రంలో అభివృద్ధి, ప్రగతి వంటి లెక్కాచారం తెలిసిన  సెంట్రల్ స్టాటిటికల్ అర్గనైజేషన్ (సిఎస్ఒ ) చెబుతూ వాతలను కూడా చూపిస్తున్నది. దాని సంగతేమిటి?

.

‘వృద్ధి రేటు 7.1శాతానికి పరిమితం కానుంది. మేం అన్ని వివరాలు సేకరించి, లెక్కలు కట్టి, బాగా  పరిశీలించాక ఈ నిర్ణారణకు వచ్చాం.' ఈ సంస్థ పేర్కొంది

 

2015-16లో 7.6 శాతంగా ఉన్న వృధ్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి 7.1శాతానికి పడిపోతున్నదని శుక్రవారం సిఎస్ఒ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొనింది.  ఈ సంస్థ మొదటి విడత అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ను విడుదల చేసింది.

 

ఇది 2014-15 లో సాధించిన వృధ్ధి రేటుతో సమానం.

 

దీంతో పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ రెండేళ్లు వెనక్కి పరిగెత్తిందని  నోట్లరద్దు తప్పని చెబుతున్న  వారి అంచనాలను కేంద్ర గణాంకాల శాఖ నిర్ధారించింది.

 

 మరోవైపు 7.1 శాతం వృద్ధి కూడా ఎక్కువేనని, అది 5 శాతానికి పరిమితం కావొచ్చని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాఅంటున్నారు. దీంతో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 5 శాతం నుంచి 5.5 శాతానికి దరిదాపులకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. 

 

ఈ ఏడాది మొదటి రెండు త్రైమాసికాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3శాతం మేర వృద్ధి సాధించిందని, నోట్ల రద్దు తరువాత ఈ పరిస్థితి మారిందని సిఎస్ ఒ చెబుతున్నది.  మైనింగ్, క్వారీయింగ్ వృద్ధి  గత మనుపున్న 9.4 శాతం నుంచి 7.4 కు పడిపోనుంది. ఇలాగే,విద్యత్తు, గ్యాస్, వాటర్ సప్లయి వగైరాలు 6.6 శాతం నుంచి  6.5 కు కన్ స్ట్రక్షన్ సెక్టర్  పరిస్థితి 3.9 శాతం నుంచి 2.9 కి జారనుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios