డీమానిటైజేషన్.. ఈ పదాన్ని అంత త్వరగా ఇండియన్స్ ఎవరూ మర్చిపోలేరు. దాని ప్రభావం దేశంలోని ప్రతి ఒక్కరిపైనా పడింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున దేశంలోని రూ.500, రూ.1000నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలను ఎదుర్కొన్నారు. దొంగ నోట్ల చలామణి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం చాలా కాలంపాటు అవస్థలుపడ్డారు. అయితే.. ఈ డీమానిటైజేషన్ కారణంగా సంవత్సరంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. దీని వల్ల కలిగిన లాభాలు ఏంటి? అసలు లాభాలు ఉన్నాయా? లేకపోతే నష్టాలు ఎమిటి.? ఇప్పుడు చూద్దాం...

నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం..

పెద్దనోట్ల రద్దు తర్వాత.. దేశంలోని ప్రజలంతా డిజిటల్ లావాదేవీలకు పెద్ద మొత్తంలో శ్రీకారం చుట్టారనడంలో అతిశయోక్తి లేదు. ప్రజలను ఆ దిశగా అడుగులు వేయించేందుకు ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలే చేసింది. రీటైలర్స్ కూడా ప్రజలను ఆకర్షిచేందుకు వినూత్న ఆఫర్లు, డిసౌంట్లు ప్రకటించాయి. డిజిటల్ పేమెంట్  అప్లికేషన్లు చాలా పుట్టుకువచ్చాయి. బ్యాంకులు, వివిధ కంపెనీల అనుసంధానంతో ఈ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు పనిచేయడం మొదలుపెట్టాయి. అంతేకాదు ప్రజలను ఆకర్షించేందుకు ఆన్ లైన్ బ్యాంకింగ్ ఛార్జీలను కూడా బ్యాంకులు తగ్గించాయి.తర్వాత మళ్లీ పెంచినప్పటికీ డీమానిటైజేషన్ ముందుకన్నా తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, మున్సిపల్ బోర్డులు, పవర్ డిపార్ట్ మెంట్స్ లాంటి సంస్థలు డిజిటల్ విధానంలోనే బిల్లులు చెల్లింపులను స్వీకరిస్తున్నాయి.

ధరల స్థిరీకరణ..

డీమానిటైజేషన్ తర్వాత ధరల స్థిరంగా ఉన్నాయి. అంతకముందు మార్కెట్ లో ఒక భూమి ధర ఈ రోజు ఒకలా ఉండగా.. మరుసటి రోజుకి పెరిగిపోయేది. కానీ    డిమానిటైజేషన్ ద్వారా ఆ సమస్య తగ్గింది. మర్కెట్ లో నల్ల ధనమంతా తగ్గిపోయింది. దీంతో.. ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. తద్వారా కొనుగోలు దారుల్లో నమ్మకం కూడా పెరిగింది.

తగ్గిన వడ్డీరేట్లు..

 డీమానిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లో లోన్ ల వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. అన్ని రకాల రుణాలపైనా వడ్డీరేటు చాలా వరకు తగ్గింది. అంతేకాకుండా ప్రజలకు రుణాలు కూడా చాలా సులభంగా దక్కాయి. ఇప్పటికే మీరు రుణం తీసుకొని ఉన్నవారైతే.. మీ రుణాన్ని చాలా త్వరగా చెల్లించి.. దాన్ని క్లోజ్ చేయవచ్చు.

ఫిక్డ్స్ డిపాజిట్ వడ్డీరేట్లు..

డీమానిటైజేషన్ కి ముందు ఫిక్స్డ్ డిపాజిట్ కి వడ్డీరేటు సంవత్సరానికి 8శాతంగా ఉండేది. ఇప్పుడు అది 6.5శాతానికి పడిపోయింది. దీంతో పెట్టుబడుదారులకు రిస్క్ లో పడిపోయారు.

మ్యూచువల్ ఫండ్స్ లో పెరిగిన పెట్టుబడులు..

డీమానిటైజేషన్ తర్వాత చాలా మంది ఉద్యోగులు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా సెక్షన్ 80(సీ) ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి పన్నును సేవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎక్కువగా మంచి లాభాలు వచ్చే ఎట్రాక్టివ్ ఇన్వెస్ట్ మెంట్స్ పై ఆసక్తి పెంచుకున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లు తగ్గడం, బంగారం పెట్టుబడులపై ఆసక్తి తగ్గడం వల్ల మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్  లో పెట్టుబడులు ఊపందుకున్నాయి.

 

 

అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్.కామ్, సీఈవో