సీబీఐ కొత్త చీఫ్ గా అలోక్ వర్మ

సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తదుపరి చీఫ్‌గా అలోక్ వర్మ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జెఎస్ ఖేహర్, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో కూడిన త్రిసభ్య కమిటీ


వర్మను సీబీఐ చీఫ్ గా నియమించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో నే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. వర్మ 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.