Asianet News TeluguAsianet News Telugu

గల్ప్ లో చిక్కుకు పోయిన కడప జిల్లా వాసి మృతదేహం

సౌదీలో ఉగ్రవాదుల జరిపిన దాడిలో వెంకట సుబ్బారెడ్డి చిక్కుకు పోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు అసుపత్రిలో చికిత్స పొందుతూమరణించాడు. ఈ వార్త తెలిశాక  కమలకూరులో ఉన్న ఆయన భార్య కుప్పకూలిపోయింది.    మూడోరోజు ఉరి వేసుకుని చనిపోయింది. ఆయన మృతదేహాన్ని క్లెయిమ్ చేసేందుకు ఎవరూ లేరు. దీనితో వెంకట సుబ్బారెడ్డి మృతదేహం కడపకు చేరే అవకాశం కనిపించడం లేదు.

dead body of kadapa worker remaining unclaimed in Saudi

గల్ఫ్ కల్లోలానికి కడప జిల్లాకు చెందిన  అర్వ వెంకట సుబ్బారెడ్డి బలయ్యాడు. నెల రోజుల కిందట ఆయన నజ్రాన్ పట్టణంలో ఇరాన్ అనుకూల ఉగ్రవాదులు  రాకెట్ దాడులు జరిపినపుడు  మృతిచెందాడు.అయితే, ఆయన మృత దేహం అక్కడ అనాథగా పడివుంది. స్వగ్రామానికి  మృత దేహాన్ని పంపాలని ఎవరూకోరకపోవడం, సౌదీ ప్రభుత్వం కూడా  ఏమీ చేయలేకపోతున్నదని  మీడియా కథనం.

 

కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన అర్వ వెంకట సుబ్బారెడ్డి ఉపాధి కోసం గల్ఫ్ వచ్చాడు.  యెమన్‌, సౌదీ అరేబియా సరిహద్దుల్లోని నజ్రాన్‌ అనే వూర్లో   కారు గ్యారేజీలో మెకానిక్ గా చేరాడు.

 

ఏప్రిల్ 10న ఇరాన్‌ అనుకూల హౌతీ ఉగ్రవాదులు ఈ నగరం మీద దాడి చేశారు.  బాంబులు, రాకెట్లు ప్రయోగించారు.

 

ఈ దాడిలో వెంకట సుబ్బారెడ్డి చిక్కుకు పోయాడు. తీవ్రంగా గాయపడ్డారు. చివరకు అసుపత్రిలో చకిత్స పొందుతూమరణించాడు. ఈ వార్త తెలిశాక  కమలకూరులో ఉన్న ఆయన భార్య కుప్పకూలిపోయింది.  బతుకు అంధకారమయిపోయిందని షాక్ అయింది.ఈ మానసిక కల్లోలంలో భర్త మరణ వార్త తెలిసిన  మూడోరోజు ఉరి వేసుకొని చనిపోయింది.

 

ఆయన మృతదేహాన్ని క్లెయిమ్ చేసేందుకు ఎవరూ లేరు. దీనితో వెంకట సుబ్బారెడ్డి మృతదేహం కడపకు చేరే అవకాశం కనిపించడం లేదు.

 

కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో మృతదేహం పంపాలని అభ్యర్థన వెళ్లే అవకాశం లేదు. బంధువులు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియడం సౌదీ అధికారులకు తెలియడం లేదు.

 

మృతదేహం స్వగ్రామం పంపించాలని  అఫిడవిట్‌ దాఖలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కేసు పెండింగ్‌లో ఉంది.

 

బాంబుల దాడి జరిగిన ప్రాంతంలో కడప జిల్లా బద్వేలు, రాయచోటికి చెందిన సుమారు చాలా మంది దాకా పని చేస్తున్నారు.  ఎవరూ వెంకట సుబ్బారెడ్డి విషయం పట్టించుకోవడంలేదు.

 

సుబ్బారెడ్డి పనిచేస్తున్న కంపెనీ యజమాని మాత్రం, బంధువులు ఎవరైనా ముందుకొస్తే, తాను దగ్గరుండి మృతదేహాన్ని స్వదేశానికి పంపుతానని చెబుతున్నారని తెలిసింది.

 

సుబ్బారెడ్డి సంబంధికుల వివరాల కోసం సౌదీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో కడప జిల్లా అధికారులు ముందుకువచ్చి, సుబ్బారెడ్డి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవడం తప్ప మరొక మార్గం లేదు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios