సినిమా అంటే హీరో ప్రపంచం. ఈ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టి ‘దర్శకుల సినిమా’ ఆవిష్కరించిన వాడు దాసరి. సినిమా పోస్టర్ హీరోని ప్రముఖంగా చూసిస్తూ తయారయ్యేది. హీరో తప్ప మరొక వ్యక్తి పేరు ప్రముఖంగా కనిపించేది కాదు. దర్శకుడి పేరు కనబడితే ప్రమాదం అన్నట్లుండేది పరిస్థితి. ఇలాంటి కాలంలో సినిమాని తన వైపు విజయవంతంగా తిప్పుకున్న దర్శకుడు దాసరి. ఇది హీరోలా గుత్తాధిపత్యం మీద తిరుగుబాటు.
సినిమాలు పడి పడి చూసే అశేష అలగా ప్రేక్షక జనానికి దర్శకుడిని పరిచయడం చేసినవాడు దాసరి నారాయణరావు.
దాసరి నారాయణ రావు కంటే ముందు ఎందరో గొప్పదర్శకులున్నారు. కళాఖండాలు సృష్టించారు. అయితే, వారెవరే దాసరి నారాయణరావు లాగా ప్రేక్షకులలోకి చొచ్చకు పోలేదు. గత కాలపు చిత్రాలన్నీ హీరోలా చిత్రాలే. దర్శకులంతా తెరవెనకే. దర్శకుడి గొప్పదనం సినిమా పండితుల విశ్లేషణలకో, పత్రికలకో పరిమితమయి ఉండేది. ఫలానా డైరెక్టర్ సినిమాఅని సినిమాకు పరిగెత్తిన సందర్భాలు తక్కుగా వుంటాయి. చివరకు లవకుశ, దేవదాసుల, దేవత.. ఇలా ఎంత గొప్పసినిమానైనా తీసుకోండి, అవన్నీ హీ రోచిత్రాలే. సినిమా పోస్టర్లలో హీరో , హీరోయిన్ ల పెద్ద బొమ్మలు , ఆపక్కన తాటికాయంత అక్షరాలతో చిత్రం పేరుండేది. ఈ టైటిల్ కింద చిన్న అక్షరాలతో డైరెక్టర్ పేరు, నిర్మాత పేరు ఉండేవి, కనిపించి కనిపించనంతగా. ఒక విధంగా ఇది హీరో గుత్తాదిపత్యమే.

సినిమా ప్రచారానికి హీరోనే ముందు పెట్టేవారు. ఈ సంప్రదాయమే సినిమా పోస్టర్లలో కనిపించింది. హీరోలందరికి వూరూర అభిమాన సంఘాల సైన్యముండేది. అభిమానసంఘాలు లేని వూరు తెలుగునాట కనిపించేది. అందువల్ల సినిమా పోస్టర్ హీరోని ప్రముఖంగా చూసిస్తూ తయారయ్యేది. హీరో తప్ప మరొక వ్యక్తి పేరు ప్రముఖంగా కనిపించేది కాదు. సాంకేతివర్గమంతా కనబడితే ప్రమాదం అన్నట్లుండేది పరిస్థితి.
ఈ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టిన వాడు దాసరి. దాసరి దర్శకుల సినిమా ఆవిష్కరించారు. దర్శకులుబయటకు రావడం మొదలయింది. దర్శకుడి సినిమాలు రావడం మొదలయింది. సినిమా మార్కెటింగ్ కు దర్శకుడి పేరూ పనికొస్తుందని రుజువు చేశారు. దర్శకుడిని పేరుకు ఉండే ప్రేక్షక వశీకరణ శక్తి ఎలా ఉంటుందో చూపించారు. ఎక్కడో చిత్రం టైటిల్ కింద దాక్కుని ఉన్న దర్శకుడిని పేరును ఆకాశంలోకి తీసుకెళ్లారు దాసరి. పోస్టర్ లో ఆయన పేరు ... ఆకాశంలో ఎగురుతున్నమేఘంలో ‘దాసరి నారాయణరావు’అని కనిపిస్తుంది. పోస్టర్ లో చాలా ప్రముఖంగా కనిపించే రీతిలో తన పేరును చేర్చకున్నాడు. ఇది ఆయన తొలిచిత్రం తాతామనవడితో మొదలయింది. అగ్రశ్రేణి హీరో యుగంలో ఇలా దర్శకుడి పేరు హీరో బొమ్మలకు పైన కనిపించడం ఒక విధంగా అమోదయోగ్యం కాదు. అయితే, దాసరి ప్రవేశమే కొత్త సంప్రదాయం. ఇది నా బ్రాండ్ చిత్రం అని చెప్పుకునే ధైర్యం ఆయనకొక్కడికే ఉండింది.

ఆయన తీసిన ఎక్కువ చిత్రాలు కొత్త తారలవి కాబట్టి ఈ టెక్నిక్ విజయవంతమయిందంటారేమో. ఎన్టీయార్, ఎ ఎన్ ఆర్ వంటి అగ్రశ్రేణి నటులతో సినిమా తీసినా , దాసరి నారాయణరావు మేఘం వాళ్లందరికంటే పైనే కనిపించేది. హీరోల వర్షిప్ తారాస్థాయిలో ఉన్న రోజులలో ఇలా దర్శకుడిగా హీరోతో సమానమయిన వాడు దాసరి.
