మూడు నెలలపాటు కన్నాట్ ప్లేస్ లో అమలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధానిలోని అత్యంత కీలక ప్రాంతం కన్నాట్ ప్లేస్ లో బస్సులు, కార్ల పై నిషేధం విధించారు. వచ్చే నెల నుంచి మూడు నెలల పాటు ఈ నిషేధం అమలులో ఉంటుంది.
చారిత్రాత్మక కట్టడాలకు హాని కలగకూడదనే ఉద్దేశంతో కన్నాట్ ప్లేస్ లో బస్సులు, కార్ల ప్రయాణంపై నిషేధం విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
అయితే ఈ ప్రాంతంలో బ్యాటరీ సైకిళ్లను, కార్లకు మాత్రం అనుమతిచ్చారు. ఈ నిషేధం వల్ల మూడు నెలలో కాలుష్యం ఎంత తగ్గిందో తెలుసుకొని భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటారు.
కాగా, కేజ్రీవాల్ గతంలో ఢిల్లీలో కాలుష్య నివారణకు సరి, బేసి నెంబర్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
