విశాఖ బెలూన్ ఫెస్టివల్ లో గందరగోళం

విశాఖ బెలూన్ ఫెస్టివల్ లో గందరగోళం

అరకులో జరగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ లో గందరగోళం నెలకొంది. బెలూన్స్ గాలిలో ఎగరడానికి ఏర్పాటు చేసిన పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో రెండు బెలూన్స్ గాలిలో ఎగరలేదు. దీంతో విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నిరుత్సాహపడ్డారు.

అసలు విషయం ఏమిటంటే.. అరకు లోయను పర్యాటక ప్రాంతంగా మరింత ఎక్కువ గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అతర్జాతీయ బెలూన్ల పండగకు శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం అరకులోయలో ఈ ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ప్రారంభించారు. కాగా.. ఈ ఉత్సవాన్ని వీక్షిచేందుకు 13 దేశాల నుంచి 16 బృందాలు భారత్ కి వచ్చాయి.

రెండు రోజుల క్రితమే విదేశీ ప్రతినిధులు భారత్ కి రాగా.. వారికి విశాఖ నగరంలోని ప్రముఖ హోటల్ లో బస ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం వారంతా ప్రత్యేక హెలికాప్టర్ లలో అరకు లోయకు చేరుకున్నారు. అయితే.. అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో.. అతిథులకు ఏర్పాట్లు సరిగా చేయలేకపోయారు. దీంతో కొందరు అతిథులు ఇబ్బందులుపడ్డారు. అంతేకాకుండా.. బెలూన్ ఫెస్టివల్ కి పబ్లిసిటీ సరిగా చేయకపోవడంవల్ల.. పర్యాటకుల తాకిడి కూడా పెద్దగా కనిపించలేదు. ఇక పరికరాలు కూడా సరిగా పనిచేయకపోవడంతో.. రెండు బెలూన్స్ గాలిలో ఎగరలేదు. అంతేకాకుండా స్థానిక మీడియాను కూడా అధికారులు అనుమతించలేదు.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos