వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రలో వివాదం చోటుచేసుకుంది. జగన్ భద్రతా సిబ్బందికి, ఆయన అభిమానులకు చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. గత నాలుగు రోజులుగా జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు ఇడుపులపాయలో మొదలుపెట్టిన ఈ యాత్ర శనివారం  కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్దకు చేరుకుంది. అయితే... జగన్ దగ్గరకు వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు. దీంతో వారందరినీ జగన్ భద్రతా సిబ్బంది తోసేసారు. ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు.. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. అనంతరం జగన్ దగ్గరకు తమను అనుమతించలేదంటూ వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.