అక్బర్ స్థానంలో రాణాప్రతాప్ ను హీరోను చేసే కొత్త ప్రయత్నానికి బీజేపీ తెర తీసింది. నిన్న రాజ్ నాథ్ మొదలెట్టిన ఆటను ఈ రోజు యూపీ సీఎం యోగి కొనసాగించారు.
మొగల్ చక్రవర్తి అక్బర్ పై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే దారిలో ఆ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నడుస్తున్నారు. రాజ్ నాథ్ కు తానేమీ తక్కువకాదని నిరూపిస్తున్నారు.
మహారాణా ప్రతాప్ 477వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ...
అక్బర్, ఔరంగజేబు, బాబర్‌ల మన దేశాన్ని నాశనం చేశారని విమర్శించారు. దేశాన్ని దోచుకోడానికే వారు ఇక్కడికి వచ్చారన్నారు.
యువత ఇప్పుడు మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, ఛత్రపతి శివాజీ లను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
మహారాణా ప్రతాప్ నుంచి ఆత్మగౌరవంతో ఎలా జీవించాలి, జీవితంలో ఎలా బతకాలో నేర్చుకోవాలన్నారు.
