అనంతపురంలో ‘రక్తచరిత్ర’

First Published 15, Nov 2017, 11:40 AM IST
cinimatic fight in between two groups in annanthapuram
Highlights
  • వ్యవసాయ భూమి విషయంలో గ్రామంలోని ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది.
  • ఈ వివాదం కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై మరొకరు వేటకొడవళ్లతో దాడి చేసుకున్నారు.

రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్తచరిత్ర సినిమా చూశారా..? అందులో ఒకరినొకరు వేట కొడవళ్లతో నరికి చంపుకుంటూ ఉంటారు. అచ్చం అలాంటి సంఘటనే తాజాగా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. రక్త చరిత్ర సినిమా కూడా అనంతపురం జిల్లా బ్యాగ్రౌండ్ లో తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే... గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామంలో బుధవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యవసాయ భూమి విషయంలో గ్రామంలోని ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై మరొకరు వేటకొడవళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన రవి, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

loader