Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ పై పోసాని ఫైర్

  • లోకేష్ పై విరుచుకుపడ్డ పోసాని
  • నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా అంటూ ప్నశ్నించిన పోసాని
  • కేసీఆర్ ని చూసి నేర్చుకోమని సలహా ఇచ్చిన పోసాని
cini actor posani sensational comments on ap minister lokesh over nandi awards

మంత్రి లోకేష్ పై సినీనటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన పోసాని లోకేష్ పై ఫైర్ అయ్యారు. నంది అవార్డు వివాదంపై ఏపీ లో ఆధార్ కార్డు కూడా లేని వాళ్లు అవార్డులపై విమర్శలు చేస్తారా అంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై పోసాని స్పందించారు. లోకేష్ కి తలంటు పోసారు. పనిలోపనిగా చంద్రబాబుపై కూడా విమర్శల వర్షం కురిపించారు. గడచిన మూడున్నరేళ్లలో లోకేష్ పై ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎవరూ చేయకపోవడం గమనార్హం.

 ‘ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా.?..లోకేశ్‌... చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా... మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా..? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా?. మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు' అంటూ ప్రశ్నించారు. నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మేం నాశనం అయ్యే వాళ్లం. రాష్ట్రం విడిపోయి మంచిదైంది. కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి.  లోకేష్ లాంటి మంత్రి ఉండటం మా ఖర్మ. లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా?. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా?. విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్నసభ్యల సంగేతేంటని’ ప్రశ్నించారు.

‘నంది అవార్డులు ఇచ్చిన జ్యూరీ సభ్యులకు లై డిటెక్టర్ పరీక్ష చేయించాలి. నిజంగా అవార్డులు న్యాయబద్ధంగా ఇచ్చామని చంద్రబాబు కూడా చెప్పలేదు. అంటే అది అబద్ధమని చంద్రబాబు కూడా ఒప్పుకున్నట్లే కదా. చంద్రబాబు చెప్పినట్లు ఐవీఆర్ఎస్ విధానంలో అవార్డులు ఇస్తే.. నాకిచ్చిన అవార్డు నేను తీసుకుంటా. అంతేకాదు.. చంద్రబాబు కాళ్లు కూడా పట్టుకుంటా. మొదట నాకు అవార్డు వచ్చిందనగానే చాలా సంతోషపడ్డా. తర్వాత టీవీల్లో కమ్మవారికే అవార్డులు కట్టబెట్టారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నేను ఈ అవార్డు తీసుకుంటే కమ్మవాడు కాబట్టే ఇచ్చారని అందరూ అంటారు. అందుకే నాకు ఈ అవార్డు వద్దు.’ అని పోసాని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios