Asianet News TeluguAsianet News Telugu

స్మతి ఇరానీ సర్టిఫికెట్లు బయటపెట్టాల్సిందే

స్మృతి సిబిఎస్ ఇ పరీక్షల సర్టిఫికెట్లు బయట పెట్టాల్సిందే,  గోప్యత చెల్లదన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధర్

CIC asks CBSE to allow verification of Smriti Irani  board exam certificates

కేంద్ర సమాచార శాఖ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు మరొక సంచలన  నిర్ణయం ప్రకటించారు.

 

కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పది, పన్నెండో తరగతుల సర్టిపికెట్లను చూపాల్సిందేనని కేంద్ర  ఆయన ఆదేశాలు జారీ చేశారు.దీనికి ఆయన అరవై రోజులు గడవు ఇచ్చారు.

 

పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలు రాసేనాటి రోల్ నంబర్లు వెల్లడించాలని జౌళిశాఖను, ఆమె చదివినట్లు చెబుతున్న హోలీ ఆక్సిలియం స్కూల్ ని కూడా ఆదేశాలు జారీ చేశారు.
 

డిగ్రీ సర్టిఫికెట్ కావచ్చు, ఇపుడు పది పన్నెండో తరగతి సర్టిఫికెట్  కావచ్చు, స్మృతి ఇరానీ చదువంతా వివాదాస్పదమే. అమె  సిబిఎస్ ఇ  బోర్డు పరీక్ష పాసయిందా లేదా అనేది ఇపుడు తాజాగా నడుస్తున్న వివాదం.

 

కేంద్రమంత్రి సర్టిఫికెట్లు ఆమె వ్యక్తిగతం , వాటిని బహిరంగ పర్చడానికి వీల్లేద్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎజుకేషన్ వాదనను ప్రొఫెషర్ శ్రీధర్ఆచార్యులు తోసిపుచ్చారు. స్మృతి ఇరానీ 10,12 తరగతుల బోర్డుపరీక్షల సర్టిఫికేట్లను తనిఖీ చేసేందుకు అనుమతించాలని ఆయన సిబిఎస్ఇ ని కూడా ఆదేశించారు.

 

ప్రధాని  నరేంద్రమోడీ డిగ్రీ సర్టిఫికేట్లను తనిఖీచేసేందుకు అనుమించాలని గత వారంలో  ఉత్తర్వులచ్చి శ్రీధర్ ఆచార్యులు పెద్ద దూమారం సృష్టించిన సంగతి తెలిసిందే.

 

తర్వాత ఆయన చూస్తున్న సబ్జక్టులనుంచి మానవవనరుల శాఖను తప్పించడం దీనిని పర్యవసనామే అని చెబుతారు.

 

 

ఇపుడు శ్రీధర్ ఈ  సంచలనం నిర్ణయం ప్రటిస్తూ స్మృతి ఇరానీ సర్టిఫికెట్లను పరీశీలనకు అనుమతించాల్సిందేనని, అందులో గోప్యమేముందని ప్రశ్నించారు.

 

సర్టిఫికెట్ వ్యక్తిగతం కాదని, అభ్యర్థి (మంత్రి ఇరానీ) వివరాలు, మార్కుల పత్రాలు మాత్రమే వ్యక్తిగతం అని , వాటిని తనిఖీకి అనుమతించనవసరం లేదని కూడా ఆయ తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు.

 

ప్రకటించనప్పటి నుంచి  పరీక్షల ఫలితాలు బహిరంగంగానే ఉంటున్నాయని చెబుతూ “ఒక ప్రజాప్రతినిధి  తన విద్యార్హతలను బహిరంగంగా ప్రకటించాక, వాటిని పరిశీలించేందుకు ఓటర్లు హక్కు ఉంది. స్మృతి ఇరానీ  ఒక పార్లమెంటు సభ్యురాలు కాబట్టి,  ఆర్ టి ఐ చట్టం ప్రకారం అమె ప్రజాసేవకురాలే అవుతుంది,” అని ఆయన తన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

 

మంత్రి ఇరానీ విద్యార్హతల ను పరిశీలించేందుకు అనుమించాలని ఝార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కు చెందిన మహ్మద్ నౌషాదుద్దీన్ వేసిన ఆర్ టిఐ పిటిషన్  అప్పీల్ ను విచారించిన తర్వాత శ్రీధర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

 

2014లో ఇరానీని కేంద్ర మావన వనరుల శాఖ మంత్రిని చేయడం బాగా విమర్శలకు గురయింది.  విద్యారంగాన్ని శాసించే  కీలకమయిన ఈ  శాఖను ఉన్నత విద్యార్హతులున్న  వారికి మాత్రమే అప్పచెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ చెబుతూ  వచ్చింది. ఇరానీ విద్యార్హతల మీద, ఆమె చదవిని కోర్సుల మీద కాంగ్రెస్  అనుమానం కూడా వ్యక్తం చేసింది. అంతేకాదు,  ఎన్నికల కమిషన్ అఫిడవిట్   లో ఆమె పేర్కొన్న విద్యార్హతలకు, అమెనిజమయిన చదువుకు తేడా ఉందని వేసిన కేసు ఇపుడు హైకోర్టు విచారణ లో ఉంది.

 

ఎన్నికల అఫిడవిట్ లో ఇరానీ ప్రస్తావించిన  బిఎ (1996)సర్టిఫికేట్ లను వెదుకుతున్నామని , అవి ఇంకా దొరకలేదని ఈ కేసులో ఢిల్లీ విశ్వవిద్యాలయం కోర్టుకు తెలిపింది.

 

 

తాను ఢిల్లీలోని హోలీ ఆక్సిలియమ్ స్కూల్ నుంచి 1991లో పది,  1993లో పన్నెండో తరగతి  సిబిఎస్ ఇ పరీక్ష పాసయినట్లు ఆమె ఎన్నికల అఫిడవిట్ లోపేర్కొన్నారు. ఇది  నిజమయితే డాక్యుమెంటు అందివ్వాలని పిటిషనర్ కోరారు.

 

ఈ పరీక్షల రోల్ నంబర్ లను పిటిషనర్ కు  అందివ్వాల్సిందే నని కమిషనర్ శ్రీధర్ ఇపుడు  జౌళిశాఖను, హోలీ చైల్డ్ ఆక్సిలియం స్కూల్ ను ఆదేశించారు.

 

ఈ రికార్డులు ఇంకా డిజిటైజ్ చేయలేదు కాబట్టి, సిబ్బందే వెదికి ఈ వివరాలు సేకరించి పిటిషనర్ కు అందివ్వాలని  ఆయన తన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

 



 

Follow Us:
Download App:
  • android
  • ios