బ్యాంకులో కూడా తెలుగులో ‘చెక్కు’ కోవచ్చు

Cheque In Kannada Dishonoured Customer Drags Bank To Court
Highlights

చాలా మందికి ఈ విషయం తెలుసో లేదో కానీ, మాతృభాషలో కూడా మన బ్యాంకులో లావాదేవీలు జరుపుకోవచ్చట. ఆర్బీఐ తన నిబంధనల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిందట. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ వివాదంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 

 

 

 

కర్ణాటకకు చెందిన ఆనంద్ దివాకర్ అనే వ్యక్తి ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు పై కోర్టులో కేసు వేశాడు. తన చెక్ ను బ్యాంకు తిరస్కరించిందని ఆరోపించాడు.  చెక్కు పై ఇంగ్లీష్ లో కాకుండా కన్నడంలో రాయడం వల్లే  బ్యాంకు అధికారులు ఈ పని చేశారని తెలిపాడు.

 

ఇలా ఈ వివాదం కోర్టు కు చేరడంతో బ్యాంకు చెక్ పై ప్రాంతీయ భాషల్లో రాస్తే అది చెల్లుతుందా చెల్లదా అనే అంశంపై చర్చ మొదలైంది.

 

బ్యాంకు వ్యవహారాలలో ప్రాంతీయ భాషల వాడకంపై గతంలో ఆర్ బీ ఐ విధించిన కొన్ని నిబంధనలు ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి.

 

రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్లో బ్యాంకు లావాదేవీలు జరుపుకోవచ్చని, అలాగే... బ్యాంకు అధికారులు కూడా వినియోగదారుడికి అర్ధమయ్యే భాషలోనే మాట్లాడాలని ఆర్ బీ ఐ నిబంధనలో ఉన్నట్లు తెలిసింది.

 

ఆనంద్ దివాకర్ కూడా ఈ అంశంతోనే కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే దీనిపై తీర్పు ఈ నెల 28కి వాయిదా పడింది.

 

అయితే జరిగిన వ్యవహారంపై ఐసీఐసీఐ అధికారులు స్పందిస్తూ కన్నడ లో రాసినందువల్ల తాము అతడి చెక్కును తిరస్కరించామనేది నిజం కాదని స్పష్టం చేశారు. ప్రాంతీయ భాషల్లో  ఉన్న చెక్ లను కూడా తాము ఆమోదిస్తున్నట్లు తెలిపారు.

 

వీలుంటే మీరు కాస్త తెలుగులో ‘చెక్’ డానికి ట్రై చేయండి. చెల్లుతుందో లేదో ఆ తర్వాత చూడొచ్చు...
 

loader