ఒకే ఆస్తిని ఇద్దరికి అమ్మినట్లు రాములమ్మ మీద ఆరోపణ
రాములమ్మ గా పేరు పొందిన మాజీ ఎంపి విజయశాంతి మీద చాలా పెద్ద ఆరోపణ వచ్చింది. ఒకే ఆస్తిని ఇద్దరి కి అమ్మినట్లు,తన మోసం చేసినట్లు ఒక వ్యక్తి కోర్టు కెక్కాడు. మద్రాసులో ఉన్న ఈ ఆస్తుల విక్రయం కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎగ్మూర్‌లో గల స్థిరాస్తుల విక్రయం మీద ఇందర్‌చంద్ అనే వ్యక్తి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద ఆమెకు నోటీలసులు జారీ చేశారు. వివరాలు ఇవి... ఎగ్మూర్‌లో విజయశాంతికి కొన్ని ఆస్తులున్నాయి. వాటిని 2006లో తాను రూ. 5.20 కోట్లకు కొనుగోలు చేశానని, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను పొందడంతో రూ. 4.68కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని ఇందర్ చంద్ చెప్పారు. కానీ అవే ఆస్తులను విజయశాంతి మరోకరికి విక్రయించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో ఇందర్‌చంద్ హైకోర్టును ఆశ్రయించాడు. మద్రాసు కోర్టులో ఆ పిటిషన్ విచారణ శనివారం జరిగింది. దాంతో కోర్టు వివాదాన్ని సామర్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, సోమవారం విచారణ ఉంటుందని దానికి విజయశాంతి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
మరిన్ని అసక్తికరమయిన వార్తలు ఇక్కడ చదవండి
