చంద్రబాబు ‘ధర్మపోరాట దీక్ష’ ప్రారంభం

First Published 20, Apr 2018, 10:16 AM IST
Chandrababu Naidu Begins Hunger Strike Against Centre On 68th Birthday
Highlights

పుట్టిన రోజునాడే చంద్రబాబు నిరాహార దీక్ష

ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం సరిగ్గా 7గంటలకు బాబు దీక్ష ప్రారంభించారు. దీక్షా వేదికపై చేరుకోగానే.. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 7గంటల వరకు ఈ దీక్ష సాగనుంది. దీక్షా వేదికకు ఇరువైపులా గాంధీ, ఎన్టీఆర్‌ చిత్రపటాలు ఉంచడం జరిగింది.
 
చంద్రబాబుకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రుల దీక్షలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షను పార్టీ శ్రేణులు ప్రారంభించాయి. కాగా సీఎం ధర్మ పోరాట దీక్షకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇది ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న దీక్ష కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

loader