ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఉదయం ప్రతిపక్ష, విపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగానే వీరంతా ‘ ఛలో అసెంబ్లీ ర్యాలీ’ నిర్వహించారు. కాగా.. ఈ రోజు తెల్లవారు జామున పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రత్యేక హోదా సాదన సమితి సంఘ నేతలు చలసాని శ్రీనివాసరావు, సినీ హీరో శివాజీ తదితరులు ఉన్నారు.

ఈ విషయంపై హీరో శివాజీ మాట్లాడుతూ.. తాము ప్రశాంతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేద్దామనుకున్నామని.. సీఎం దానిని అడ్డుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో కొంచెం కూడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.