కడప జిల్లా స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర మంత్రులు చేసినవన్నీ ఉత్తుత్త ప్రకటనలేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018 బడ్జెట్  రుజువు చేసింది. దీనిని మీద స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెట్టవద్దని, స్టీల్ ప్లాంట్ ను ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా జెండాలు పక్కన పెట్టి సమైక్యంగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. రాయలసీమకు జీవధారగా ఉండే స్టీల్ ప్లాంట్ సాధించే వరకు  పోరాటం చేస్తామని ఆయన అన్నారు.