వారణాసి ముస్లిం మహిళలు కోర్టు కంటే హనుమంతుడినే ఎక్కువగా నమ్ముకున్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావాలన్ని ప్రార్థిస్తున్నారు.
త్రిపుల్ తలాక్... ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం.
కోర్టు తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారణాసిలోని ముస్లిం మహిళలు మాత్రం హనుమంతుడిని ఆశ్రయించారు.
తమకు అంజనీసుతుడే న్యాయం చేస్తాడని వారు భావిస్తున్నారు. త్రిపుల్ తలాక్ రద్దు కోసం రోజూ 100 సార్లు తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసాను పఠిస్తున్నారు.
