హెయిర్ లాస్ కి కొత్త ట్రీట్ మెంట్... ఫ్రెంచ్ ఫ్రైస్

First Published 9, Feb 2018, 3:53 PM IST
Can McDonalds french fries cure hair loss
Highlights
  • జంక్ ఫుడ్స్ లో ఒకటైన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మాత్రం జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టేయవచ్చు అంటున్నారు నిపుణులు.

ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తింటే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికీ తెలుసు.  అయితే.. జంక్ ఫుడ్స్ లో ఒకటైన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మాత్రం జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టేయవచ్చు అంటున్నారు నిపుణులు. అది కూడా కేవలం మెక్ డోనాల్డ్స్ లో లభించే ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే ఈ హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుందట. నమ్మశక్యంగా లేకపోయినా.. మీరు చదివింది నిజమే. దీని మీద జపాన్ కి చెందిన పలువురు సైంటిస్టులు పరిశోధనలు కూడా చేశారు. అంతేకాదు.. దీనికి సంబంధించి పీటర్ ఎకానమీ అనే మ్యాగజైన్ లో ఆర్టికల్ కూడా ప్రచురితమైంది.

ఆ ఆర్టికల్ ప్రకారం.. మెక్ డోనాల్డ్స్ లభించే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే.. జుట్టు రాలడం ఆగిపోయి.. కొత్త జుట్టు పెరుగుతుందట. ఎందుకంటే... ఈ మెక్ డోనాల్డ్స్  రెస్టారెంట్ లో ఫుడ్స్ తయారీకి ఉపయోగించే ఆయిల్ లో డీమిథైల్ పాలీ సిలాక్సిన్(డీఎంపీఎస్) అనే  కెమికల్ ఉంటుందట. అది హెయిర్ గ్రోత్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే  కాదు.. మెక్ డోనాల్డ్స్ లో లభించే ఫ్రైడ్ ఐటెమ్ ఏది తిన్నా.. హెయిర్ లాస్ సమస్య తగ్గి.. హెయిర్ గ్రోత్ బాగుంటుందని వారు చెబుతున్నారు.

loader