Asianet News TeluguAsianet News Telugu

కొత్త కారు కొన్నారా.... ఈ విషయాలు గుర్తుంచుకోండి

  • మార్కెట్లోకి కూడా రోజుకో కొత్త మోడల్ అడుగుపెడుతూ.. ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
  • వాహనాన్ని రోడ్డు మీద నడిపేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో  చెప్పడం కష్టం
  • ఆర్థికంగా ఏర్పడిన నష్టాన్ని మనం తీసుకునే వాహన భీమా తీరుస్తుంది
Buying Auto Insurance 5 Things To Keep In Mind

ప్రస్తుత కాలంలో కారు లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మార్కెట్లోకి కూడా రోజుకో కొత్త మోడల్ అడుగుపెడుతూ.. ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దీంతో నచ్చిన కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే.. మరి మీ కారుకి ఇన్ సూరెన్స్ చేయిస్తున్నారా.. ఇది చాలా అవసరం. వాహనాన్ని రోడ్డు మీద నడిపేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో  చెప్పడం కష్టం. అయితే ప్రమాదంలో వాహనానికి ఏదైనా జరిగితే ఎంతో బాధపడతాం. ఆర్థికంగా ఏర్పడిన నష్టాన్ని మనం తీసుకునే వాహన భీమా తీరుస్తుంది.కాబట్టి వాహన భీమా చాలా అవసరం. అయితే.. ఎలాంటి భీమా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

భీమాలో రకాలు..

వాహన భీమాలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, మరొకటి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ. వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా పాలసీని తప్పనిసరి చేస్తూ చట్టం ఉన్న దేశం కూడా మనదే.కాగా.. కాంప్రహెన్సివ్ భీమా.. థర్డ్ పార్టీ భీమాతో పోలిస్తే చాలా ఖరీదైనది. కాకపోతే.. ఇందులో దొంగతనం, యాక్సిడెంట్ లాంటివి జరిగితే వెంటనే క్లైమ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.

నో క్లైం బోనస్...

వాహన భీమాలో తప్సనిసరిగా నోక్లైం బోనస్ ఉంటుంది. దీని ద్వారా మనం ఎప్పుడైనా భీమా క్లైం చేసుకోవాల్సి వస్తే.. దాదాపు 50శాతం వరకు మనం దీని ద్వారా పొందవచ్చు. అంతే కాదు వాహన బీమా క్లెయిం కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. చిన్న మరమ్మతులకు పరిహారం పొందడం వల్ల నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) వదులుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

వాలంటరీ ఎక్సెస్..

ఇది కూడా ఒక విధమైన వాహన భీమానే... ఇందులో భీమా క్లైం చేయకుండా మన చేతిలోని డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రీమియం ఎమౌంట్ ని మీరు 35శాతానికి తగ్గించుకోవచ్చు. దీనికి భీమా ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాలంటరీ ఎక్సెస్ కింద మీరు చెల్లించిన మొత్తం తరువాతి సంవత్సరానికి ఉపయోగపడుతుంది.

వీటికి  భీమా రాదు..

ప్రమాదం జరిగితే వాహనానికి భీమా వస్తుందన్నది వాస్తవం. అయితే.. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదం జరిగినట్లయితే.. దానికి భీమా రాదన్న విషయం గుర్తించుకోవాలి. చిన్న చిన్న డ్యామేజీలకు కూడా భీమా క్లైం చేసుకోలేం. ఒక వేళ మీ వాహనానికి భీమా ఉన్నప్పటికీ.. డ్రైవింగ్ సరిగా రాని వ్యక్తి దానిని నడిపి ప్రమాదం జరిగినా కూడా భీమా వర్తించదు.             

 

అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్. కామ్ సీఈవో                             ``         

Follow Us:
Download App:
  • android
  • ios