కాచుకో... జియో

bsnl bumper offer to their coustemars
Highlights

  • రిలయన్స్ కు పోటీగా బీఎస్ఎన్ ఎల్ బంపర్ ఆఫర్

కొత్త ఏడాది టెలికాం యుద్ధం మొదలైంది. రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో యుద్ధంలోకి అడుగుపెడితే దాన్ని ఢీకొట్టడానికి బీఎస్ఎన్ఎల్ మరో ఆయుధంతో ముందుకు వచ్చింది.

 

కొత్త సంవత్సరం కానుగా భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్ఎన్ ఎల్) తమ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ ఉన్నవారికి ప్రమోషనల్‌ ఆఫర్‌ను ప్రకటించింది.  కేవలంలో రూ. 144 ప్రీపెయిడ్‌ ఓచర్‌తో 30 రోజులపాటు అపరిమితంగా లోకల్‌/ఎస్ టిడి కాల్స్‌ మాట్లాడుకోనే సౌకర్యాన్ని అందిస్తోంది.

 

180 రోజుల కాలపరిమితితో ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఉచిత కాల్స్‌ తర్వాత లోకల్‌/ఎస్ టిడి కాల్స్‌పై నిమిషానికి 80 పైసలు, ఎస్‌ఎంఎస్ కు 50 పైసలు, రోమింగ్‌లో లోకల్‌ ఎస్‌ఎంఎస్ కు 38 పైసలు వసూలు చేస్తారు.

బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ కలిగిన వినియోగదారులు ఇతర ఆపరేటర్ల సిమ్‌ కార్డు కలిగి ఉంటే.. ఎంఎన్‌పి ద్వారా బిఎస్ఎన్ ఎల్‌కు మారి కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

loader