యుపిలో బాబు ను కాపికొడుతున్న బిజెపి

BJP copies Naidus loan waiver  in UP polls
Highlights

దక్షిణాది నినాదాలతో యుపిలో గెలవాలనుకుంటున్న బిజెపి

 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మోదీ పార్టీని గట్టెక్కిస్తాడోలేదో అనే అనుమానం బిజెపి లో బలంగా ఉన్నట్లుంది. అందుకే, మోదీ ప్రసంగాలకంటే,  ఎన్నికల వరాలకే ఎక్కువ ఆకర్షణ ఉన్నట్లు ఈ పార్టీ కనిపెట్టింది. బిజెపి గెలుపు చిట్కా దక్షిణాది లో ఉన్నట్లు కూడా ఆ పార్టీ గ్రహించినట్లుంది. ఆంధ్రప్రదేశ్  , తమిళ నాడు ఎన్నికల హమీలను ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో  ప్రయోగిస్తే, ఆంధ్రలో తెలుగుదేశం, తమిళ నాడులో జయలలిత  లాగా విజయం సాధించవచ్చిన భావిస్తూ ఉంది.  ఉత్తర ప్రదేశ్ బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోను చూస్తే తెలుగుదేశం, ఎఐఎడిఎంకెలు దీనిని బాగా ప్రాభావితం చేశాయని చెప్పవచ్చు.

 

ఎన్నికల మ్యానిఫెస్టో ను ఈ రోజు విడుదల చేశారు.

 

మ్యానిఫెస్టో విడుదల చేస్తూ యుపి ఎన్నికల్లో గెలిపిస్తే వ్యవసాయరుణాలను మాఫీ చేస్తామని అమిత్ షా చెప్పారు.  ఈ విషయాన్ని  మ్యానిఫెస్టోలో హైలైట్ గా పేర్కొన్నారు. అంతేకాదు, తర్వాత వడ్డీలేని రుణాలందిస్తారు.

బాబు హామీ ఇచ్చినట్లుగానే, ప్రతిఇంట్లో ఒక టాయిలెట్ కట్టిస్తామని, గ్యాస్ కనెక్షన్ ఇస్తామని బిజెపి చెప్పింది.

ఉన్నత విద్యాసంస్థలలో ఉచిత వై.ఫై  సౌకర్యం కల్గిస్తారు.

 

వ్యవసాయ రుణాల మాఫీ వల్లే చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ లో గెలుపొందినట్లు  బిజెపి విశ్వసిస్తూ ఉంది.

 

ఇకరెండో రెండో దక్షిణాది హామీ ఎమిటో తెలుసా. లాప్ టాప్.

 

ఇంటర్నెట్ కనెక్షన్ తో లాప్ టాప్ ఇస్తామన్నది గత ఎన్నికల్లో ఎఐడిఎంకె నాయకురాలు జయలలిత హామీ.

 

అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందితే, రాష్ట్రంలోని యువకులందరికి ల్యాప్ టాప్ లు ఇవ్వడమే కాకుండా ఒక జిబి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇస్తామని పార్టీ ప్రణాళికలో పేర్కొన్నారు.

 

రుణమాఫీ , ల్యాప్ టాప్ లు బాగా పనిచేస్తాయనేనేమో, ఉత్తర ప్రదేశ్ లో  మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలుస్తామని షా ప్రకటించారు.

loader