కర్నూలులో టీడీపీకి బిగ్ షాక్

First Published 18, Nov 2017, 2:41 PM IST
big shock to chandrababu in kurnool
Highlights
  • వైసీపీ జెండా కప్పుకున్న టీడీపీ నేతలు
  • జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నేతలు

కర్నూలు జిల్లా బనగానపల్లెలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. చంద్రబాబు ప్లాన్ కి జగన్ రివర్స్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆకర్ష్ పేరిట ఇప్పటివరకు 22మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. కాగా.. చంద్రబాబు ఆకర్ష్ ప్లాన్ కి జగన్ చెక్ పడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటూనే.. టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకుంటూ పార్టీ బలగాన్ని పెంచుకుంటున్నారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే... టీడీపీ కర్నూలు జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సమక్షంలో శనివారం సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరగా, వారందరినీ జగన్‌... సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

రామిరెడ్డితో పాటుగా కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్, మాజీ ఎంపీటీసీ కుమార్, మద్దూరు రామసుబ్బారెడ్డి, అలాగే బనగానపల్లె మండలం కైఫా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నడిపెన్న, మహేష్ తో పాటు పలువురు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

loader