Asianet News TeluguAsianet News Telugu

విభజన అవమానకరం...దిగమింగుకుని ముందుకు పోదాం

రాష్ట్ర విభజన అవమాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈ అవమానాన్ని దిగమింగుకుని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఆయన జూన్ రెండో తేదీన రాష్ట్ర ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. జూన్ 8న ఆయన మహాసంకల్పం దీక్ష  చేయిస్తారు. ఈ సందర్భంగా ఆయన  బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

bifurcation is insulting says Chandrababu Naidu

విభజన అవమానం దిగుమింగుకోవాలి...ముఖ్యమంత్రి బాబు పిలుపు

 

విభజన అవమానాన్ని దిగమింగుకోండి, కసిని, కోపాన్ని రాష్ట్రాభివృద్ధిపై చూపించండి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

జూన్ 2 ఉదయం పది గంటల సమయానికి రాష్ట్రంలో ప్రతి ఒకరూ నవనిర్మాణ దీక్ష – ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.

 

ఇలాగే జూన్ 8 సాయంత్రం 5 గంటలకు మహాసంకల్పం తీసుకోవాలని కూడా ఆయన ఈ రోజు అధికారులతో జరిగిన సమావేశంలో చెప్పారు.

 

నవనిర్మాణ దీక్ష వారం రోజులు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ  శని, ఆదివారాలు ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా విధుల్లో పాల్గొనాలని కూడా ఆయన చెప్పారు. అధికారులు వినూత్నంగా ఆలోచించాలని, ప్రేరణగా పని చేయాలని  మూస ధోరణిలో పాలన సాగిస్తే ప్రగతి వుండదని ఆయన చెప్పారు. జూన్ 8 కల్లా రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు వుండకూడదని నిర్దేశించారు. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ మంత్రికి, నవ నిర్మాణ దీక్ష సమన్వయ బాధ్యతలను ఆయన అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios