Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరుకి వచ్చిన బీర్ యోగా..

  • రకరకాల ఆసనాలు వేస్తూ ఒక పద్ధతి ప్రకారం బీర్ తాగడమే బీర్ యోగా
  • బెంగళూరు నగరంలో యువత దీనిని ఫాలో అవుతున్నారట.
Beer yoga tiptoes into Bengaluru

Beer yoga tiptoes into Bengaluru

బీర్ తెలుసు.. యోగా తెలుసు.. మరి ఈ బీర్ యోగా ఏమిటబ్బా.. కొంపతీసి బీరు తాగుతూ యోగా చేస్తారా ఏమిటి అని అనుకుంటున్నారా.. మీరు ఊహించింది నిజమే.. ఇప్పటి వరకు పాశ్యాత్య దేశాల్లోనే ఉన్న ఈ బీర్ యోగా.,. ఇఫ్పుడు మన దేశానికి పాకింది. బెంగళూరు నగరంలో యువత దీనిని ఫాలో అవుతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ బీర్ యోగా.. మొదట లండన్ లో ప్రారంభమైంది. రకరకాల ఆసనాలు వేస్తూ ఒక పద్ధతి ప్రకారం బీర్ తాగడమే ఈ యోగా. అంటే మామూలు ఆసనాలకే బీర్ జోడించడమేననమాట. బాటిల్‌ని బ్యాలెన్స్ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ అది కిందకి పోకూడదు. యోగి జ్వాలా ఈ యోగాను పరిచయం చేశారు. అయితే ఇది అంత తేలికైందికాదు. బీర్‌లో కొంత శక్తి ఉంటుంది. యోగా చేస్తూ మందుకొడితే ఆ శక్తి మనకూ వస్తుందట. 16 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ దీనిని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ బీర్ యోగా బెంగళూరుకు చేరింది. బెంగళూరు నగరంలో పబ్ కల్చర్ ఎక్కువగా నడుస్తుంది. ఈ బీర్ యోగా చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారని ఓ యోగా నిపుణుడు తెలిపారు. జూన్ నెలలో ఒక సారి  ఈ రకం యోగాని ఏర్పాటు చేసి కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేశారు. అయితే.. దీనిని తిరిగి ప్రారంభించారు. యువత ఎక్కువగా ఇందులో పాల్గొంటున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios