మెట్రో ఎఫెక్ట్  ఇక్కడ బాగా కనపడుతోంది..!

because of metro house rents are hike
Highlights

  • త్వరలో ప్రారంభంకానున్న మెట్రో రైలు
  • మెట్రో కారణంగా పెరుగుతున్న ఇంటి అద్దెలు

నగర ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మెట్రో వస్తే.. ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అయితే.. మెట్రో ఎఫెక్ట్.. ట్రాఫిక్ మీద చూపుతుందో లేదో తెలీదు కానీ.. ఆలోపు ఇళ్లు, స్థలాలపై పడింది. మెట్రోకీ వీటికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా..? అయితే.. ఇంకెందుకు ఆలస్యం చదవండి మీకే తెలుస్తుంది.

ఈ నెల చివరి వారం నుంచి పరులు తీయనున్న మెట్రో రైలు.. మియాపూర్ నుంచి నాగోల్ వరకు ప్రయాణించనుంది. సాధారణంగా బస్సులో మియాపూర్ నుంచి నాగోల్ వెళ్లాలనుకుంటే  దాదాపు రెండు గంటలు పడుతుంది.  ఇక వర్షం పడితే.. ట్రాఫిక్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. మెట్రో రైలులో అయితే 45నిమిషాల్లో చేరుకోవచ్చు. అందుకే ఇప్పుడు అందరూ మెట్రో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా.. మెట్రో స్టేషన్లకు దగ్గర ఉండే ప్రాంతాల్లో ఇళ్లు తీసుకొని ఉంటే.. ఆఫీసులకు వెళ్లడం సులభమని నగరవాసులు భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వీరంతా నాగోలు, ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.  ఎక్కువ మంది అద్దెకు ఇళ్ల కోసం రావడంతో.. ఇంటి యజమానులు కూడా అద్దెలు పెంచేస్తున్నారు. మెట్రో స్టేషన్లకు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్తీల్లోని ఇళ్లకి కూడా గిరాకీ బాగా పెరిగిపోయింది.

ఒక్క ఇంటి అద్దెలు మాత్రమే కాదు స్థలాలకు కూడా గిరాకీ బాగా పెరిగిపోయింది. చదరపు అడుగుకి రూ.వెయ్యికి పైగా ధరలు పెంచుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో కొత్తగా ఇళ్లను నిర్మించుకోవడానికి అనేకమంది ఇష్టపడుతున్నారు. బహుళ అంతస్తుల్లోని ఇళ్ల ధరలు ఉన్నఫళంగా పెరగకున్నా, క్రమంగా పెంచేందుకు నిర్మాణదారులు ప్రయత్నిస్తున్నారు. నాగోలు మెట్రోస్టేషన్‌కు ఆనుకుని హెచ్‌ఎండీఏకు ప్రస్తుతం 199 ఎకరాలున్నాయి. ఏడాదిన్నర కిందట ఇక్కడ చదరపు గజం రూ.10 వేలు పలికింది. లేఅవుట్‌గా మార్చాక రూ.17 వేలకు చేరింది. నాలుగు నెలల కిందట రూ.30 వేలకుపైగా ఉన్న ధర.. కారిడార్‌ రాకతో రూ.45 వేలకు పెరిగినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్‌  అధికారి ఒకరు తెలిపారు.

loader