నిజామాబాద్ ఎంపి కవిత ఏ కార్యక్రమం చేపట్టినా దానికి సర్వత్రా మద్దతు ఉంటుంది.  ఆ మధ్య ఆమె  టూవీలర్స్ మీద సురక్షితంగా ప్రయాణం చేయాల్సిన  ఆవశ్యకత  గురించి ‘సిస్టర్స్ 4 ఛేంజ్’ ట్విట్టర్ ప్రోగ్రాం చేపట్టి దేశంలోని ప్రముఖుల మద్ధతు సంపాదించారు. ఇలా ఆమె గతంలో చేపట్టిన కార్యక్రమాల గూడా ప్రజలమద్దతు కూడగట్టి విజయం సాధించారు. ఇపుడు నిజాం బాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని ఆమె క్యాంపెయిన్ చేపట్టారు. దీనికోసం అనేక రాష్ట్రా ల ముఖ్యమంత్రులను కలిశారు. ప్రధానిని కలిశారు. ఇపుడు ఈ క్యాంపెయిన్ కు బాబా రామ్ దేవ్ కూడా మద్ధతు ప్రకటించారు.

పసుపు బోర్డు ఏర్పాటుకు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చేస్తున్న బాబా రామ్ దేవ్ మద్దతు మరొక ముందడుగు అని వేరే చెప్పనవసరం లేదు. కవిత  క్యాంపెయిన్ మీద, పసుపు బోర్డు ఏర్పాటుచేయడం మీద ప్రధాని మోడీకి బాబా రామ్ దేవ్ లేఖ రాశారు. పసుపు పండించే రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు మద్దతు ధర నిర్ణయించాలని బాబా రామ్ దేవ్ ఈ లేఖలో కోరారు.

ఇటీవలే హరిద్వార్ కు వెళ్లిన ఎంపి కవిత పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను రామ్ దేవ్ కు వివరించారు. ఆయన మద్దతు కూడగట్టారు. ఇదే విషయం మీద కవిత చొరవతో   అసోం, కేరళ, మహారాష్ట్ర ముఖ్య మంత్రులు ప్రధాని మోడీకి లేఖలు రాశారు.