ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో ఈ మధ్య కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఇటీవల ఇండియాలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. అయితే ఇటీవల వాట్సాప్ యాప్ వివిధ కలర్లలో కూడా వస్తుందంటూ కొన్ని లింక్ లు చాలా మంది వాట్సాప్ కి వస్తున్నాయి.

 

వాటిని తెరిచారో ఇక అంతే సంగతులు. మీ వాట్సాప్ సమాచారంతో పాటు ఫోన్, కంప్యూటర్లు కూడా హ్యాక్ అవడం గ్యారెంటీ.

 

మీకు నచ్చిన రంగుల్లో వాట్సాప్ ను వాడుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ చాలా మంది వాట్సాప్ లకు ఓ మేసేజ్ షేర్ అవుతూ ఉంది. చాలా మంది వాటిని పరిశీలించకుండానే వివిధ గ్రూప్ లలో షేర్ చేస్తున్నారు.

 

వాట్సాప్ కు వచ్చిన ఈ లింక్ ను క్లిక్ చేస్తే యూ ఆర్ ఎల్ బ్రౌజర్ ఓపెన్ అవుతోంది. ఆ తర్వాత డెస్క్ టాప్ తో మాత్రమే మీరు వాట్సాప్ ను వివిధ రంగుల్లో చూడగలరంటూ మరో మేసేజ్ ప్రత్యక్షమవుతోంది.

 

దాన్ని కూడా ఓకే చేస్తే ఆ వైరస్ కాస్త మీ కంప్యూటర్లో చొరబడుతోంది. ఇలా వాట్సాప్ టార్గెట్ గా ఈ కొత్త  వైరస్ ఇప్పుడు ఇంగ్లీష్ తో పాటు దాదాపు 10 భారతీయ భాషల్లో కూడా  షేర్ అవుతోంది. వాటిని పొరపాటున క్లిక్ చేసినా అంతే సంగతలు. కాబట్టి వాట్సాప్ కొత్త ఫీచర్ల కోసం ఆశ పడి హ్యాక్ కు గురవకండి.