సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై దాడి జరిగింది. దీనితో ఈ రోజు ఆయన జరపాలనుకున్న మీడియా సమావేశం బుధవారం గలభా చోటుచేసుకుంది. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయం ఏజీకే భవన్‌లోనే ఈ సంఘటన జరిగింది. దాడిలో ఆయన గాయపడలేదు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై దాడి జరిపే ప్రయత్నం జరిగింది. దీనితో ఈ రోజు ఆయన జరపాలనుకున్న మీడియా సమావేశం బుధవారం గలభా చోటుచేసుకుంది. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయం ఏజీకే భవన్లోనే ఈ సంఘటన జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం విలేకరులతో సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఎకెజి భవన్ మూడో అంతస్తుకు వెళుతుండగా కొంతమంది వ్యక్తులు దాడిచేశారు. దీనితో ఏచూరి కింద పడ్డారు.
అయితే, ఆయనకు గాయాలేవీ తగల్లేదు. ఏచూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, అక్కడే ఉన్న సిపిం కార్యకర్తలు వారికి దేహశుద్ధి చేశారు.
తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని దాడికి యత్నించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో మొత్తం నలుగురు పాల్గొన్నారు. వీరంతా భారతీయ హిందూసేన కార్యకర్తలని తెలిసింది. దీనిపై ఏచూరి స్పందిస్తూ ఇది సంఘపరివార్ కుట్ర అని విమర్శించారు. సంఘ్ గూండాగిరికి తాను భయపడనని అన్నారు.
