కోర్టు ప్రాంగణంలో నిందితుడిపై కాల్పులు డిల్లీలోని రోహిణి కోర్టు వద్ద ఘటన కాల్నింపుల్దిలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం
దేశ రాజధాని డిల్లీలో దారుణం జరిగింది. ఓ కేసులో పట్టుబడిన నిందితుడిని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో నిందితుడిపై కోర్టు ఆవరణలోనే కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన డిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ లో జరిగింది. ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయనడగా అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై నిందితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
అయితే కట్టుదిట్టపైన సెక్యూరిటీ వుండే కోర్టు ఆవరణలో ఈ ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకు ముందు కూడా ఇదే కోర్టు ప్రాంగణంలో సేమ్ ఇలాగే కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే చనిపోయాడు. నిందితులపై వరుసగా జరుగుతున్న దాడులపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుని కోర్టు ప్రాంగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిల్లీ వాసులు కోరుకుంటున్నారు
