తెలంగాణా, ఆంధప్రదేశ్ లు భగ భగ మండుతూన్నాయి. కొన్ని చోట్ల ఎండవేడిమి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరినట్లు అనధికారిక సమాచారం. ఇలా 50 డిగ్రీలకు ఉష్టోగ్రత చేరుకుందన్న ఒక ప్రాంతంలో ఒక స్కూటర్ నడుస్తూండగనే అంటుకుంది. చూస్తుండగనే కాలిపోయింది.ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది.
తెలంగాణా, ఆంధప్రదేశ్ లు భగ భగ మండుతూన్నాయి. కొన్ని చోట్ల ఎండవేడిమి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరినట్లు అనధికారిక సమాచారం. ఇలా 50 (47 దాటిందని అధికారులు చెబుతున్నారు) డిగ్రీలకు ఉష్టోగ్రత చేరుకుందన్న ఒక ప్రాంతంలో ఒక స్కూటర్ నడుస్తూండగనే అంటుకుంది. చూస్తుండగనే కాలిపోయిందిలా...
ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది.కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన బూదూరి లక్ష్మయ్య - లలిత దంపతులు పాల్వంచ లో జరిగే వివాహానికి వెళుతున్నారు.దారిలో వినోభానగర్ గ్రామం సమీపంలోకి రాగానే వారి వాహనానికి ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
క్షణాల్లో టీవీయస్ యాక్టివా వాహనమంతా మంటలు వ్యవాపించాయి. చూస్తుండనే దగ్దం కావడం మొదలయింది.మంటలు లేయగానే భయబ్రాoతులే దంపతులు వాహనాన్ని వదిలేసి దూరానికి పరుగులు తీశారు.
స్కూటర్ మంటలకు ఆహూతయింది.వాహనంలోని ఉన్న రూ.3000 నగదు, దుస్తులు దగ్దమైనట్లు భాదితులు తెలిపారు.
