Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి భగ్గు మంటున్నది

నేటి విశేష వార్తలు

  •  రాంఛి పోలీసుల అదుపులో టిఆర్ ఎస్ నేత
  • విజయవాడ వంగవీటిరంగా అభిమానుల ఆందోళన
  • వైపిపి ఎంపి కారుతో ట్రాక్టర్ ఢి,ఒకరు మృతి
  • సింగరేణి భగ్గుమంటున్నది
asianet telugu crime column andhra telangana police investigation
పిడుగుపాటుతో నెల్లూరులో ఒకరు మృతి

నెల్లూరు నగరంలోని పొడలకూరు రోడ్డు వాటర్ ట్యాంక్ సమీపంలో పిడుగు పాటు వల్ల ఒకరు మృతి చెందారు.

మరొక  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు మూలపేటకు చెందిన చెంచయ్యగా గుర్తించారు.

కాలువలోకి దూసుకెళ్లిన కారు, 5 గురు మృతి 

ఉత్తర ప్రదేశ్: ఓ కారు అదుపు తప్పి కాలువలో పడిన ఘటన బారబంకి జిల్లాలోని ఫతేపూర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు, కాలువలో నుంచి కారును బయటకు తీసి..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

విజయవాడలో కొనసాగతున్న ‘వంగవీటి రాధ’  ఆందోళన

 

విజయవాడ: విజయవాడలో ఉద్రికత్త కొనసాగుతూ ఉంది. వంగవీటి రంగాకు వ్యతిరేకంగా వైసిపి కార్మిక నాయకుడు గౌతమ్  రెడ్డి  చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా  రంగా వారసులు  ఆందోళనచేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పట్నం స్టేషన్ నుండి భారీ ర్యాలీ తో రాధ,రత్నకుమారి ర్యాలీతో  బయలు దేరారు.  దీనితో  ట్రాఫిక్ భారీగా  స్తంభించింది.  అంతకు ముందు గాంధీ బొమ్మ కి పూలదండ  వంగ వీటి రాధ పూల మాల వేసి నమస్కరించారు.

బొకారో ఎక్స్.ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం 

విజయనగరం : బొకారో ఎక్స్.ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకివలస.వద్ద ఇంజన్.కంపార్ట్ మెంట్.ల.మధ్య లింక్.వీడడంతో ఇంజన్ ముందుకు వెళ్లిపోయింది. కంపార్ట్ మెంట్స్ డొంకినివలస వద్ద సుమారు గంట సేపు ఉండిపోయి. తరువాత ఇంజన్ వెనక్కి రావడంతో మరలా కంపార్ట్ మెంట్స్.తో కలిపి రైలు ముందుకు కదిలింది. రైలు ఆగివున్న సమయంలో ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది.

బొకారో ఎక్స్ప్రెస్ కు  తప్పిన పెను ప్రమాదం 

విజయనగరం : బొకారో ఎక్స్.ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకివలస వద్ద ఇంజన్.కంపార్ట్ మెంట్ ల మధ్య లింక్ వీడడంతో ఇంజన్ ముందుకు వెళ్లిపోయింది. కంపార్ట్ మెంట్స్ డొంకినివలస వద్ద సుమారు గంట సేపు ఉండిపోయి. తరువాత ఇంజన్ వెనక్కి రావడంతో మరలా కంపార్ట్ మెంట్స్ తో కలిపారు.  రైలు ముందుకు కదిలింది. రైలు ఆగివున్న సమయంలో ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది.

సింగరేణి భగ్గుమంటున్నది

asianet telugu crime column andhra telangana police investigation

 

డిపెండెంట్ ఉద్యోగాల పై సింగరేణి సిఎండి శ్రీధర్
తన వైఖరి మార్చుకోవాలని కార్మిక్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కొన్ని వేల కార్మిక కుటుంబాలకు అన్యాయం జరుగుతుంటే
చూస్తు ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
18, 19న జరిగే జేబీసీసీఐ సమావేశంలో 
డిపెండెంట్ ఉద్యోగాల రద్దు పై చర్చజరుగునుంది. అప్పటిలోపు వైఖరి మార్చుకోకపోతే
సింగరేణి భవన్ (ప్రధాన కార్యాలయాల్లో) విధులను నిరవధికంగా బహిష్కరిస్తామని సంఘాలు  ప్రకటించాయి.
కంపెనీ లాభాల గురించి ఆలోచించండి, 
కానీ కార్మికులను ముంచేలా ఆలోచన చేయకండని  సింగరేణి అధికారుల సంఘం( CMOAI) హెచ్చరించింది.

 

⁠⁠⁠⁠⁠గౌతం రెడ్డి ఇంటి ముందు వంగవీటి  రంగ అభిమానుల ఆందోళన

asianet telugu crime column andhra telangana police investigation

అలనాటి కాపు నాయకుడు వంగవీటి రంగా మీద వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు  గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియజేయడానికి రాధా అభిమానులు, కాపు నాయకులుపెద్ద ఎత్తున గౌతంరెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అందరిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. గౌతంరెడ్డి ఇంటి సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. గౌతంరెడ్డి ఇంటి వద్దకు వచ్చేందుకు బయల్దేరిన వంగవీటి రాధాను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరొక వైపు వైసిసి గౌతంరెడ్డి  వ్యాఖ్యలను ఖండించింది. ‘వంగవీటి రంగా మా నాయకుడు. వైఎస్సార్ కు మంచి సన్నిహితుడు. రంగాను మేము ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాం. వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గౌతమ్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతం, వైసీపీకి సంబంధించినవి కావు,’ అని పార్టీ సీనియర్ నేత పార్థ సారధి అన్నారు.మీడియాలో గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసి మా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తున్నామని కూడా ఆయన చెప్పారు.

  అంబేద్కర్ విగ్రహం కూల్చివేత, యానాంలో ఉద్రిక్తత

asianet telugu crime column andhra telangana police investigation

యానాం రవితేజ కోల్లేజ్ లో  అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి 11 గంటలపుడు
ద్వంసం చేశారు. సుమారు 300 మంది కత్తులతో దళిత మాల వర్గీయులు పై దాడి చేశారని సమాచారం. అపుడే ఈ విగ్రహంకూల్చేశారని అనుకుంటున్నారు. రవితేజ కాలేజీలో ఉద్రికత నెలకొనిఉంది. 
 

రామచంద్రపురం లో చేపల మార్కెట్ ఎత్తవేయవదంటూ గొడవ

 

సంగారెడ్డి జిల్లా,రామచంద్రపురం మండలం, రామచంద్రపురం ప్రధాన రహదారి పక్కన ఉన్నా చాపల మార్కెట్ ని తొలగించడానికి జిహెచ్ ఎం సి అధికారులు రావడంతో గొడవ మొదలయింది.  తొలగించవద్దు అంటు అధికారులను వ్యాపారులు అడ్డుకున్నారు. అధికారులకు వ్యాపారులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. వ్యాపారులకు మద్దతుగా బిజెపి నాయకులు నిలబడ్డారు. వీడియో

 

నూజివీడు ట్రిపుల్ ఐటి ర్యాగింగ్ కేసు

నూజివీడు ట్రిపుల్ ఐటి లో ర్యాగింగ్ కి పాల్పడిన విద్యార్దులపై చర్యలకు రంగం సిద్దమయింది.
ఆ మధ్య జూనియర్స్ పై దాడి చేసిన ఘటనలో మొత్తం 22మంది విద్యార్దులను  అధికారులు గుర్తించారు.
ఈ దాడికి రూపకల్పన చేసి,ప్రధాన పాత్ర పోషించిన 6గురు విద్యార్ధులను కూడా గుర్తించారు.
ర్యాగింగ్ కు పాల్పడిన  విద్యార్దులపై చర్యలు తీసుకోవాలని ట్రిపుల్ ఐటి యాజమాన్యాన్నిజిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతo,యస్.పి. త్రిపాటి. ఆదేశించారు.

ఒంగోలు ఎంపి కారు ఢీ కొని ఒకరి మృతి

 

ఈ రోజు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోజరింది.గిద్దలూరు నుంచి ఒంగోలు వెల్తున్నా వైవి సుబ్బారెడ్డి కారు పొదిలి మండలం తలమళ్ళ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ వెంకట నారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే వైవి సుబ్బారెడ్డి జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

  తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నాడు శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు శ్రీవారిని 48,823 మంది భక్తులు దర్శించుకున్నారు. నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీవారి దర్శనం పేరుతో లక్షలకు టోపి  పెట్టిన  దళారి

తిరుమల: భక్తుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు తిరుమలలో తిష్ట వేసినట్లు ఈ సంఘటనతో స్పష్టంగా అర్థమవుతోంది. దేశవిదేశాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు దళారులు కొత్తపన్నాగం పన్నారు. శ్రీవారి దర్శనం పేరుతో కొంత మంది దళారులు భక్తులను నట్టేట ముంచేస్తున్నారు. భక్తుల నుంచి రూ. 1.70 లక్షలు వసూలు చేసి ఓ దళారి ఉడాయించారు. ఈ సంఘటనపై విజిలెన్స్‌ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. శ్రీవారి భక్తులను మోసం చేసే దళాలను కఠింగా శిక్షించాలని భక్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలలోకి వచ్చే దళారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

రాంఛి పోలీసుల అదుపులో టిఆర్ ఎస్ నేత

మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ నేత మూల సత్యనారాయణ రెడ్డి రాంఛీ (ఝార్ఖండ్) పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్ట్ ల వద్ద నుంచి డబ్బులు తీసుకువస్తుండగా ఆయన చిక్కినట్టు సమాచారం. ఆగష్టు 31 న మావోయిస్టు కేంద్రకమిటి సభ్యుడు మూల దేవేందర్ రెడ్డి నుండి డబ్బులు తీసుకువస్తుండగా ఆయనపట్టుబడినట్లు తెలిసింది.  సత్యనారాయణ రెడ్డితో పాటు నిర్మల్ కు చెందిన మరో మావోయిస్ట్ సానూభూతి పరుడు కూడా ఉన్నట్టుతెలిసింది.  మావో కేంద్ర కమిటిలో మూల దేవేందర్ రెడ్డి చాలా కీలకమయిన వ్యక్తి. పట్టుబడిన సత్యనారాయణ టీఆర్ ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ మూల రాజిరెడ్డి సోదరుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినసమాచారం ప్రకారం దర్యాప్తును రాంఛీ పోలీసులు  ముమ్మరం చేశారు.

శ్రీశైలం హైవే మీద  ప్రమాదం

పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీశైలం హైవే ఫై  సరస్వతి గూడ గేటు సమీపంలో  rtc బస్సు లారీ ఢీ కొన్నాయి. బస్సు లో 38 మంది ప్రయాణికులున్నారు. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వస్తున్నఈ బస్సు,  ఇమామ్ గూడ పెట్రోల్ పంపు నుండి. ఒక సరిగా ఒక లారీ  బయటకు రావడంతో ఢీకొంది.  బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు య్యాయి.

జడ్చర్ల వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి


తెలంగాణ  మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారిని వెనకనుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. పలితంగా ఒకరు మృతి చెందారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఒక్కరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.  తిరుపతి నుండి హైదరాబాదుకు వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఏకె 47 మిస్ ఫైర్, గన్ మన్ మృతి

నెల్లూరు జిల్లా ఏ ఎస్ పి కార్ డ్రైవర్ రమేష్  ఛాతి లోకి దూసుకెళ్లిన బులెట్ దూసుకుపోయింది. ఆయన చేతిలో ఉన్న ఎకె 47 మిస్ ఫైర్ అయిందని, అపుడు బులెట్ ఛాతీలోకి దూసుకుపోయిందని తెలిసింది.  అయితే, జిల్లా పోలీసు కార్యాలయంలో ఘటన జరిగింది.ఆయనను బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ  చికిత్స ఉండగానే రమేష్ మృతిచెందాడు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios