టిఆర్ఎస్ నుంచి ప్రాణహాని అంటున్న తెలంగాణ పాటల సోమన్న

asianet telugu crime column andhra telangana police investigation
Highlights

నేటి విశేష వార్తలు

  • తెలంగాణ చరిత్ర కెక్కని తేదీ, సెప్టెంబర్ 2, 1947
  • తిరుమల లడ్డుపోటులో అగ్ని ప్రమాదం
  • నక్సల్ కోటలో మహిళా కమెండోల సాయంతో బ్రిడ్జి నిర్మాణం
  • కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
  • విజయవాడలో ‘విక్రమ్ ’ గౌడ్ డ్రామా
  • హైదరాబాద్ లో పోకిరీని చితక బాదిన స్థానికులు

టిఆర్ఎస్ నుంచి ముప్పు ఉందంటున్న తెలంగాణ పాటల సోమన్న

2019 ఎన్నికల లోపు టిఆర్ ఎస్ వారు నన్ను చంపేస్తారని  ప్రముఖ కళాకారులు  ఏపూరి సోమన్న ఈరోజు సంచలన ప్రకటన చేశారు.   పాట భుజానేసుకుని, ‘ఏవనిపాలయ్యందిరో తెలంగాణ-ఏవడేలుతున్నడురో తెలంగాణ’ వూరూర తిరుగుతున్న సోమన్నకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. అదే చాలా మందికి ఇబ్బంది గా ఉంది.  సోమన్న పదునైన పాటని అన్ని వైపులా తీసువెళ్లన్నది సోషల్ మీడియా. కుటుంబ కలహాల కారణంతా అరెస్టయినాడు. పోలీసులాయనను లాకప్ కడ్డీలకు కట్టేశారు. ఈ రోజు విడుదలయ్యారు. అపుడు చేసిన ప్రకటన ఇది. తన ప్రాణ హాని ఉందుంటున్నాడు. తన అరెస్టుకు కారణమయిన ఎమ్మెల్యే భార్య పై భార్యపై సోమన్న ఫిర్యాదు చేశాడు. ఆమె తనని కక్ష కట్టిందని,తనకు ఆమె వల్ల ముప్పు ఉందని ఆయన మీడియా కు చెప్పారు.

 

విజయవాడ నగల కార్ఖానా చోరీ, ఇద్దరి అరెస్టు

ఆమధ్య విజయవాడ గవర్నర్ పేట రాజగోపాల రెడ్డి రోడ్డు లో బంగారు ఆభరణాల తయారీ కార్ఖానాలో  దొంగతనం చేసిన గ్యాంగ్ మరో ఇద్దరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు రామ్ లకన్ సింగ్, పం ఉత్తర్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నిందితుల మీద కేసులు వున్నాయని పోలీసులు చెప్పారు.

 

హైదరాబాద్ పోలీసులకు రూల్స్ ఉండవు

 

ఆ మధ్య హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నేరాల జాబితాతో నియమాలు ఉల్లంఘిస్తే పడే శిక్షల మీద ఒకచార్ట్  విడుదల చేశారు. హెల్మెట్ లేకపోయినా జరిమానా ఉంటుంది, లైసెన్స్ లేకపోయినా జరిమానా విధిస్తారు. అంతేకాదు,నంబర్ లేని వాహనం మీద ప్రయాణించినా నేరమే. అయితే,  ఈ నియమాలు అమాయక ప్రజలకు మాత్ర మే. పోలీసులకు ఇవేవీ వర్తించవు. పై ఫోటో చూడండి. పోలీసులు చక్కగా హెల్మట్ లేకుండా ఎలా వెళ్తున్నారో AP11 AT 4265 ద్విచక్రవాహనం మీద. ఈ ఫోటో సెప్టెంబర్ రెండో తేదీన తీసింది ....వీళ్లని పట్టి,  నిలదీసి, రోడ్డు మీద లైసెన్స్ కాగితాలు వెరిఫై చేసి ఆపై హెల్మట్ ధరించనందుకు జరిమానా వేసే రోజొస్తుందా?

 

తెలంగాణా చరిత్రకెక్కని తేదీ...

 

70 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే సెప్టెంబ‌ర్ 2, 1947న వరంగల్ సమీపంలోని ప‌ర‌కాల‌లో ర‌క్తం చిందింది. మ‌రో జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. భార‌త దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చినా, హైద‌రాబాద్ స్టేట్ ఇంకా నిజాం నిరంకుశ పాల‌న‌తో మ‌గ్గిపోతోంది. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేసేందుకు చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి జ‌నం పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. ఆగ్ర‌హించిన నిజాం పోలీసులు, ర‌జాకార్లు విచ‌క్ష‌ణా ర‌హితంగా ఊరేగింపుపై కాల్పులు జ‌రిపారు. ఆనాటి ఘ‌ట‌న‌లో 15 మంది మ‌ర‌ణించారు, అంత‌కు ఎన్నో రెట్లు జ‌నం గాయ‌ప‌డ్డారు.. దుర‌దృష్టం కొద్దీ ఈ ఘ‌ట‌న‌కు చ‌రిత్ర‌లో పెద్ద‌గా స్థానం దొర‌క‌లేదు.

తెలంగాణప్రభుత్వం వచ్చాక  నాటి తెలంగాణ విమోచనోద్యమం గురించిన చాలా విషయాలు బయటకొస్తాయనుకున్నారు. అలా జరగలేదు.  అసలు విమోచనోద్యమాన్ని అధికారికంగా జరిపేందుకే టిఆర్ ఎస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీని నుంచి బిజెపి నుంచి కాంగ్రెస్ దాకా అన్ని పార్టీలుడిమాండ్ చేస్తున్నా టిఆర్ ఎస్ ప్రభుత్వం ఖాతరుచేయడంలేదు. కారణం ఎమయి ఉంటుంది... నాటి ఉద్యమానికి టిఆర్ ఎస్ నాయకత్వం లేకపోవడమేనా... ఎవరో నాయకత్వం వహించిన ఉద్యమాన్ని, తమ నాయకుడి బొమ్మ లేకుండా కొనియాడం ఇష్టం లేదేమో... అందుకే పరాకాల రక్తపాతం తేదీ పైకి రాలేకపోతున్నది.

 

విజయనగరం జిల్లాలో  దారుణం

విజయనగరం జిల్లాలో  దారుణం జరిగింది.  సీతానగరం మండలం గాదెవలసలో ఒక  మైనర్ బాలికపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. తర్వాత హత్య చేశారు.  మృతదేహాన్ని స్థానిక చెరువులో పడేశారు. మృతురాలు బొబ్బిలి మండలం రెడ్డి వలస గ్రామానికి చెందిన బాలికగా గుర్తించారు.నిందితులు కోసం పోలీసుల గాలిస్తున్నారు.

 

తిరుమల లడ్డుపోటులో అగ్ని ప్రమాదం

 

తిరుమలలో శ్రీవారి చెంత అగ్ని ప్రమాదం జరిగింది.  శనివారం మధ్యాహ్నం (సెప్టెంబర్ 2) లడ్డూ పోటులోమంటలు ఎగిసిపడ్డాయి. బూందీ తయారు చేస్తున్న సమయంలో గ్యాస్ పొయ్యి నుంచి మంటలు లేచాయి.  పోటు మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే కార్మికులు బయటకు  పరిగెత్తుకుంటూ వచ్చారు.  అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు వచ్చి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదగాని లడ్డు ప్రసాదాల తయారీ నిలిచిపోయింది.ఇటీవల బూందీ పోటులో ప్రమాదం జరగటం ఇది రెండో సారి.

 

 

ఉప్పల్ లో టిప్పర్ ఢీ కొని మహిళ మృతి

శనివారం నాడు హైదరాబాద్ ఉప్పల్ డిపో వద్ద వరంగల్ జాతీయ రహదారిపై టిప్పర్ , బైక్ ఢీకొన్నాయి. బైక్ మీద వెళ్తున్న మహిళ  అక్కడి  క్కడే మృతి చెందింది. మరొక  ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు అందాల్సి ఉంది.

 

మహిళా కమెండోలో కాపలా , 15 రోజుల్లో వంతెన నిర్మాణం

మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఛత్తీష్ గడ్ లో  ఒక వంతెన నిర్మాణం 15 రోజులలో పూర్తయింది. బ్రిడ్జి నిర్మాణం సాగుతున్నపుడు నక్సల్స్ బెడదనుంచి బ్రిడ్జి కడుతున్న కూలీలకు కాపలాకాసిందేవరో తెలుసా, ఛత్తీష్ గడ్ పోలీసుకు  చెందిన మహిళా కమెండోలు. ఆ వూరి కి బ్రిడ్జి లేక  ప్రజలు 11 సంవత్సరాలుగా నానా అగచాట్లు పడుతున్నారు.

 

కృష్ణా జిల్లాలో ప్రమాదం; బైకుపై వస్తున్న యువకుడు దుర్మరణం

 

కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన బి టెక్ చదువుతున్న యువకుడు ఇమిడిశెట్టి రాజ్ కుమార్ ను, తన తండ్రి నాగేశ్వరరావు బాగా చదువుకోమని శుక్రవారం రాత్రి ఇంట్లో మందలించారు. రాజ్ కుమార్ మైలవరంలోని ఎల్బీఆర్సీఈ కళాశాలలో బి టెక్ సెంకండ్ ఇయర్ చదువుతున్నాడు. మందలింపు కారణంగా ఇంట్లో అలిగి తన బైకుపై రాజ్ కుమార్ బయటకు వచ్చాడు. శనివారం ఉదయాన్నే రాజ్ కుమార్ జి.కొండూరు మండల పరిధిలోని జి.కొండూరు - చెవుటూరు బైపాస్ రోడ్డులో శవమై కనిపించాడు. బైకుపై నుండి కింద పడటంతో ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని అక్కడి పరిస్థితిని బట్టి తెలుస్తోంది. మృతుని తలకు తీవ్రగాయమైంది.జి.కొండూరు ఎస్సై రాజేష్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

హైదరాబాద్ లో పోకిరికి దేహశుద్ది

 

హైదరాబాద్ లో ఒక పోకిరికి స్థానికులు  దేహశుద్ది చేశారు. ఒక వివాహితను వేధిస్తున్న వ్యక్తిని పట్టుకుని చితకబాదిజూబ్లీ హిల్స్ పోలీసులకు అప్పగించారు.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78 లో ఈ ఘటన జరిగింది. నిందితుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాడు.అయితే, బోరాబండ నివాసముంటూ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు.  పేరు ప్రసన్న కుమార్. చాలా కాలంగా ఒక వివాహితను వేధిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు  అమ్మాయి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అయినా వేధింపులు ఆగలేదు. దీనితో ఈ రోజు అతగాడిని పట్టుకుని నడిరోడ్డులో చెప్పులతో దేహశుద్ది చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.

 

విజయవాడలో కూడా ‘విక్రమ్ గౌడ్’ డ్రామా

విజయవాడలో కూడా తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకుడు  విక్రమ్ గౌడ్ తరహా హత్యాయత్నం డ్రామా జరిగింది. మాజీ జర్నలిస్టు పేర్ల శ్యాంకుమార్ తన పైనే హత్యాయత్నం చేయించుకున్నాడు. విజయవాడ సీతారాంపురంలో శ్యాంకుమార్  ఉంటాడు. సాయంకాలం దినపత్రిక  నడుతుపుతుంటాడు.  సుబ్బారావు  శ్యాంకుమార్  ఆస్తిని బ్యాంకులో తాకట్టు  పెట్టి రూ. 20 లక్షలు రుణం తీసుకున్నాడు. అయితే, తిరిగి చెల్లించలేదు. దీనితో  ఆస్తిని జప్తు చేస్తామంటూ బ్యాంకు నుంచి శ్యాంకు నోటీసులు వచ్చాయి. అపుడు పెద్దమనుషుల మధ్య వారిద్దరూ పంచాయితీ పెట్టి రూ.15 లక్షలు ఇచ్చేందుకు సుబ్బారావును ఒప్పించారు. అయితే, ఇక్కడ డ్రా మా బీజాలు పడ్డాయి. తన పై , హైదరాబాద్ విక్రమ్ గౌడ్ లాగా, హత్యాయత్నం చేయించుకుంటే.... అపుడు కేసులో తోడల్లుడిని ఇరికించొచ్చు,  భారీగా డబ్బు వసూలు చేసుకోవచ్చ. ఇలాంటి ప్లాన్ చేశాడు. భవానీపూరానికి చెందిన నాగేంద్ర, మధురానగర్‑కు చెందిన కృష్ణప్రసాద్‑లతో కలిసి ఈ ప్లాన్ అమలుచేసుందుకు సిద్ధమయ్యారు. అయితే, ఎందుకయినా మంచిదని తుపాకులు వాడలేదు.  ఎక్కడ కత్తితో పొడవాలో కూడా కూడా నిర్ణయించారు. ఇందుకు రూ. 2 లక్షలు డీల్ కుదిరింది. వారం కిందట శ్యాంను ఇంటి వద్దే పథకం ప్రకారం  నాగేంద్ర, కృష్ణప్రసాద్‑లు కత్తితో పొడిచి పారిపోయారు. తరువాత శ్యాం ఆసుపత్రిలో చేరాడు. అమెరికాలోని ఉన్న తోడల్లుడి కొడుకుతో రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ శ్యాం మనుషులు బేరాలు మొదలు పెట్టారు. అయితే, హత్య మీద దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానితులు దొరక్క పోగా అసలు కథ కనిపించింది. దీనితో శ్యాం కుమార్ తోపాటు ఇద్దరు స్నేహితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

loader