ప్రముఖ మీడియా నెట్ వర్క్.. ఏషియా నెట్ న్యూస్ నెట్ వర్క్... దేశంలోని టాప్ 30లో చోటు సంపాదించుకుంది. ఇక రీజనల్ లాంగ్వేజ్ లలో మొదటి స్థానంలో నిలిచింది. కామ్ స్కోర్ మొబైల్ మ్యాట్రిక్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గతేడాది 2017 డిసెంబర్ లో దేశంలోని అన్ని వెబ్ సైట్ ల పై సర్వే చేయగా.. రీజనల్ లాంగ్వేజ్ లలో( హిందీ, ఇంగ్లీష్ మినహాయించి) ఏషియా నెట్ మొదటి స్థానం దక్కించుకుంది. భారత్ లోని టాప్ వెబ్ సైట్లలో గతంలో 116వ ర్యాంకులో ఉన్న ఏషియా నెట్... ప్రస్తుతం 28వ ర్యాంకుకు చేరుకుంది. అతి తక్కువ కాలంలో.. ఏషియా నెట్ ఈ ఘనత సాధించడం గమనార్హం. ప్రస్తుతం ఏషియా నెట్ ఫేస్ బుక్ పేజీని 5.5 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. యూట్యూబ్ లో 1.1 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.ఇతర ప్రముఖ రీజనల్ లాంగ్వేజ్ వెబ్ సైట్స్.. ఏబీపీ గ్రూప్, మనోరమ,వికటన్, న్యూస్ హంట్, ఈనాడు ఇండియా. కామ్, టెలిగ్రాఫ్, లోక్ మాత్ లను ఏషియా నెట్ ఎప్పుడో దాటేసింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. కేరళ రవాణా శాఖ మంత్రి థామస్ చాందీ.. తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అతని అవినీతి అక్రమాలను బయటపెట్టడంలో.. ఏషియానెట్ మళయాళం టీం పాత్ర చాలా ఉంది. ఇక.. ఏషియానెట్ కన్నడ ఛానెల్ సువర్ణా న్యూస్ విషయానికి వస్తే.. 2018 కర్ణాటక ఎన్నికల సర్వే అందరి కన్నా ముందు నిర్వహించిన ఘనత సువర్ణా న్యూస్ కే దక్కుతుంది. ఏషియానెట్ న్యూస్ ఇంగ్లీష్  వెబ్ సైట్ ఏషియానెట్ న్యూసబుల్.. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించడంలో ముందుంది. ఐపీఎస్ ఆఫీసర్ డీస్ రూపా ఎదుర్కొన్న వేధింపుల గురించి న్యూసబుల్ ఫుల్ కవరేజీ ఇచ్చింది. అంతేకాదు కర్ణాటక కార్పొరేటర్లకు కర్నాటక రాష్ట్ర గీతం తెలియదన్న విషయం కూడా న్యూసబుల్ బయటపెట్టింది. న్యూసబుల్ కారణంగానే ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలోని అందరూ బీబీఎంపీ అధికారులు ప్రతిరోజూ రాష్ట్ర గీతాన్ని ఆలపించడం తప్పనిసరి అయ్యింది.

ఇక ఏషియానెట్ తెలుగు వెబ్ సైట్ ని 2016 అక్టోబర్ లో ప్రారంభించారు. ఈ వెబ్ సైట్  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాలు, తాజా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అలాగే ఏషియానెట్ తమిళ వెబ్ సైట్ .. ప్రారంభించిన కొద్ది కాలంలోనే తమిళనాడులో సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఈ వెబ్ సైట్ ఫేస్ బుక్ పేజీని 5.7లక్షల మంది ఫాలోఅవుతున్నారు. ప్రముఖ టీవీ ఛానెల్ రిపబ్లిక్ టీవీ కి చెందిన అర్నబ్ గో స్వామి.. ఈ ఏషియానెట్ న్యూస్ కి కో-ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్  లాంగ్వేజీలను మినహాయించి.. ఇతర అన్ని భాషల్లోనూ ఏషియా నెట్ తన సత్తా చాటుతోంది.