రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది నానుడి. ప్రతీసారి అది రుజువవుతూనే ఉంది. అయితే ఈ ఘటన మాత్రం ఎవరూ ఊహించనిది.

 

ఒక వైపు బీజేపీ నేతలు పాతబస్తీలో జెండా పాతేందుకు సిద్ధమవుతున్న వేళ... సాక్షాత్తు పార్టీ చీఫ్ అమిత్ షా హైదరాబాద్ పై గురిపెట్టిన వేళ... ఏఐంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధానమంత్రి మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ముఖ్యంగా కుల్ భూషణ్ జాదవ్ ఉరి నిలుపుదల చెయ్యడంలో మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రశంసనీయమని కొనియాడారు. పాకిస్తాన్ ను సరైన రీతిలో దారికి తెచ్చుకున్నారని కితాబిచ్చారు.

 

ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలను పాక్ పాటించాలని కోరారు. కుల్ భూషణ్ భారత్ కు తిరిగ రావాలని మనస్ఫర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

 

ఓవైసీ ఇలా హఠాత్తుగా తమ బద్ద విరుధోలను ప్రశంసిస్తూ మాట్లాడటంపై ఆయన పార్టీ నేతలే  ఆశ్చర్యపోతున్నారు.