శుభవార్త, నెల రోజుల్లో ఆంధ్రలో 3390 ఐటి ఉద్యోగాలు

AP  to create 3390 it jobs in next one month
Highlights

నెల రోజులు ఆంధ్రలో మరొక  21 ఐటి కంపెనీల ఏర్పాటు

వచ్చే నెల రోజుల్లో రాష్ట్రంలో  మరో 21 ఐటీ కంపెనీలను ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు(ఏపీఎన్‌ఆర్‌టీ)   ఏర్పాటు చేస్తున్నది.  దీనితో ఆంధ్రప్రదశ్ లో మరో 3,390 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వి షయాన్ని వెల్లడించారు.  ఈ రోజు అమరావతిలోని ఆయన క్యాంప్ ఆఫీస్ లో  ఎపి నాన్ రెసిడెంట్ తెలుగు పాలకవర్గ సమావేశం జరిగింది. ఇందులో కంపెనీల ఏర్పాటు గురించి చర్చించారు. ఇప్పటివరకు ఏపీఎన్ఆర్‌టీ సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ లో 32 ఐటీ కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పారని వాటి వల్ల  3,090 మందికి ఉద్యోగాలు లభించాయని ఆయన చెప్పారు. నెల  రోజుల్లో మరొక 3390 ఉద్యోగాల ను కల్పిస్తారని ఆయన చెప్పారు. ఉద్యోగావకాశాలు పెంచేందుకు, పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రుల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతూ దీనికోసం ప్రత్యేక ఎపి ఎన్ ఆర్ టి సెజ్ లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

loader