Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కోడెల

  • అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కోడెల
  • రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా
ap speaker kodela shiva prasada rao got international level identity

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఇటీవల 63వ కామన్వెల్త్‌ పార్లమెంట్‌ సదస్సు జరిగింది. ఈ సదస్సులో..కోడెల శివప్రసాదరావు ఏపీకి చేసిన సేవలను బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బంగ్లాదేశ్‌ స్పీకర్‌ శిరుమిన్‌చౌదరి, భారతదేశ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌లు కొనియాడారు.

యువతతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకొనే ప్రతి ఒక్కరికీ కోడెల ఆదర్శమని బంగ్లా ప్రధాని హసీనా అన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో ఆయన నిర్మించిన శ్మశానవాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. రైతు బిడ్డగా ఉండి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా... ఏ పదవికైనా వన్నె తెచ్చారన్నారు. అంతర్జాతీయ వేదికలపై సైతం ప్రశంసలు పొందుతున్న స్పీకర్‌ కోడెల ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని సుమిత్రా  మహాజన్ అన్నారు.

కోడెలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios