ప్రధాని మోదీకి కౌంటర్ వేసిన లోకేష్

First Published 19, Apr 2018, 2:18 PM IST
ap minister lokesh counter attack on PM narendra modi
Highlights


లోకేష్ ట్వీట్ వార్

ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ వేశారు. మోదీ ట్వీట్ కి లోకేష్ కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు. సరైన పరిశోధన, ఆధారాలు లేకుండానే తనపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
 
దీనికి లోకేశ్‌ స్పందిస్తూ... చట్టంలో పొందుపర్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని ప్రశ్నించినందుకు ఎలాంటి ఆధారాలు లేకుండానే బీజేపీ నాయకులు మాపై బురద జల్లుతూ, అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు’ అని ప్రధాని ట్వీట్‌కు లోకేష్ కౌంటర్‌ ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం లోకేష్ ట్వీట్ వైరల్ గా మారింది.

loader