జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆది

First Published 20, Apr 2018, 3:29 PM IST
ap minister adi narayana reddy sensational comments on ycp president ys jagan
Highlights

వైఎస్ మరణానికి జగనే కారణమన్న ఆదినారాయణ రెడ్డి

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై మంత్రి ఆది నారాయణ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.   జగన్మోహన్ రెడ్డి దరిద్రమే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమని ఆయన విమర్శించారు.

జగన్ పొరపాటున సీఎం అయితే రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టుపెడతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’కు మద్దతుగా ఆయన కడపలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. నాలుగేళ్ళు వేచి చూసి విసిగిపోయి దీక్షకు దిగామని చెప్పారు. సీఎం చంద్రబాబు దీక్షతో మరో ప్రజా ఉద్యమం వస్తోందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.                                      

loader