మంత్రి సోమిరెడ్డి పరువు తీసిన చంద్రబాబు

First Published 16, Nov 2017, 6:06 PM IST
ap cm chandrababu praises a farmer before agriculture minister
Highlights
  • అంతర్జాతీయ వ్యవసాయ సదస్సుకు హాజరైన సీఎం
  • రైతును సన్మానించిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ వ్యవసాయ వేదిక సాక్షిగా.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరువు తీశారు. పనిలోపనిగా అదే వేదికపై ఉన్న ఆ శాఖ సెక్రటరీ, డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ ల పరువును కూడా విశాఖ సముద్రంలో కలిపేశారు. ఒక సాధారణ రైతుకి ఉన్న తెలివి.. వీళ్లకు లేదంటూ తేల్చిపారేశారు. ఆ సమయంలో వీరంతా వేదికపైనే ఉండటం గమనార్హం.

అసలేం జరిగిందంటే.. విశాఖలో మూడురోజుల పాటు అంతర్జాతీయ అగ్రిటెక్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. సదస్సు రెండోరోజైన గురువారం  గుంటూరు జిల్లాకు చెందిన రాధాకృష్ణా మూర్తి అనే రైతు మాట్లాడుతూ.. పంటలు పండించడం, కలుపు తీయడం, ఖర్చులు తగ్గించడంలో తన అనుభవాన్ని వివరించారు. అతను చెప్పిన తీరు, అవలంభిస్తున్న విధానాలు చంద్రబాబుని ఆకట్టుకున్నాయి. దీంతో.. వెంటనే ఆ రైతును వేదికమీదకు పలిచి..ఆయనకు సన్మానం చేశారు. అనంతరం ఆ రైతుకి ఉన్న తెలివి మంత్రులకు, సెక్రటరీ, డైరెక్టర్ , వైస్ ఛాన్సలర్ కి లేదంటూ చరుకలంటించారు. నాలెడ్జ్ అంటే యూనివర్శిటీలో కాదని, క్షేత్రస్థాయిలో అమలు చేసి ఫలితాలు రాబట్టటమే నిజమైన నాలెడ్జ్ అని అన్నారు.

loader