ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 9గంటల 40 నిమిషాలకు ప్రారంభమైన సమావేశాలు.. మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల వరకు జరిగాయి. అనంతరం సమావేశాలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

 చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పాత్ర పోషించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై చర్చ సాగింది.