Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణానికి ఆంధ్రా అల్టిమేటం

విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అయిదు వేల కోట్ల రుపాయల బకాయీలను  చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం తెలంగాణాకు నెలాఖరు దాకా గడువు విధించింది. జూన్ 30 వ తేదీలోపు , తెలంగాణాకు విద్యుత్ సరఫరా బిల్లుల బకాయి రు. 5000 కోట్లను చెల్లించాలని ఎపి జెన్కో తెలంగాణాకు నోటీసు పంపించింది.ఇది కట్టకపోతే, ఇకపవర్ బంద్ అని అల్టిమేటమ్ జారీ చేసింది.

andhra sets deadline for  Telangana to clear all power bills

అయిదు వేల కోట్ల రుపాయల బకాయీలను  చెలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం తెలంగాణాకు నెలాఖరు దాకా గడువు విధించింది. జూన్ 30 వ తేదీలోపు , తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేసినందుకు చెల్లించాల్సిన బకాయి రు. 5000 కోట్ల ను చెల్లించాలని ఎపి జెన్కో తెలంగాణాకు నోటీ సు పంపించింది.రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి తెలంగాణా కు ఆంధ్ర విద్యత్తు సరఫరా చేస్తూ ఉంది. అయితే, దీనికి సంబంధించి బకాయి రు. 5000 కోట్లకు చేరుకుందని ఆంధ్ర చెబుతున్నది. ఇది కట్టకపోతే, ఇకపవర్ బంద్ అని అల్టిమేటమ్  జారీ చేసింది.

 ఈ బకాయీలు చెల్లించాలని చాలా నెలలుగా తెలంగాణాకు గుర్తు చేస్తున్నామని, ఈ లేఖలను తెలంగాణా ఖాతరు చేయడం లేదని అందుల్ల  జూన్ నెలాఖరు గడువు విధించడం జరిగిందని ఎపి జెన్కో అధికారులు చెప్పారు.

చాలా విషయాలలో రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరగడం లేదని అందువల్ల ఈ విషయం కూడా పెండింగులో ఉందని తెలంగాణా అధికారులు చెబుతున్నారు. అయితే, ఆస్తుల పంపకానికి, విద్యుత్ బిల్లుల చెల్లింపుకు ముడేయవద్దని ఆంధ్రా కోరుతూ ఉంది.

జూన్  30 లోపు బకాయీ చెల్లించకపోతే, ఆ మరుసటి రోజు నుంచి విద్యత్ సరఫరా నిలిపివేస్తామని ఆంధ్ర  హెచ్చరించింది. ఈ విషయాన్ని నిన్న ఏసియానెట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘ ఆంధ్రా కు సరఫరా చేస్తున్న సింగరేణి బొగ్గుకు మాత్రం ఠంచన్ గా డబ్బు వసూలు చేసుకుంటూ,  మేం సరఫరా చేసిన విద్యుత్తుకు పైసలు చెల్లించమంటే, ఏవో తెగని వివాదాలకు ఈ బిల్లులను ముడేయడం ఏమిటి?,’అని ఆంధ్ర అధికారులు అసహనంతో ఉన్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios