Asianet News TeluguAsianet News Telugu

మోదీ-జగన్ భేటీ : అమిత్ షా ముందుకు రానున్న టిడిపి యవ్వారం

తొందర్లో ఆంధ్రా రానున్న బిజెపి అధ్యక్షుడు అమిత్  షా ముందు ‘టిడిపి యవ్వారం తేల్చండి’ అని పార్టీలోని ఒక వర్గం పంచాయతీ పెట్టాలనుకుంటాంది. 2019 నాటికి పార్టీ బలపడితే, ఎక్కువ సీట్లు అడుగుతారని భయంతో చంద్రబాబు పార్టీని ఎదగకుండా అడ్డుకుంటున్నారని, ఈ పెద్దన్న ధరోణి బాగా లేదని వారు షా కు వివరించబోతున్నారు. ప్రధానితో జగన్ జరిపిన ఒక చిన్న సమావేశాన్ని రభస చేసి ప్రధానిని నిందిస్తున్నారని  కూడా వారు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు.

 

Andhra BJP to complain to amit Shah against TDP big brother attitude

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, బిజెపి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం మొదలయింది.

 

ఇదెంతవరకు పోతుందో తెలియదు. బిజెపిలో ఉన్న చంద్రబాబు వ్యతిరేకులు మాత్రం దీనిని తెగేదాకా లాగాలనుకుంటున్నారు. చంద్రబాబు నేస్తులు మాత్రం ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదే, వారం రోజుల్లో చల్లబడి పోతుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే, ‘ ఆంధ్రకు దేవుడిచ్చిన వరం’ అని చంద్రబాబును పొగిడిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చక్రం తిప్పి, గాయపడిన ముఖ్యమంత్రి ఆత్మాభిమానాన్ని ఏదో విధంగా నయం చేస్తాడని భావిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు కూడా ఈ ఆశాభావమే వ్యక్తంచేస్తున్నారు. ‘పురందేశ్వరో, మరొకరో అనుకుంటే  తెగిపోయే బంధం కాదు టిడిపి-బిజెపిలది కాదు’ అని పార్టీ ఎమ్మెల్యే ఒకాయన ధీమా వ్యక్తం చేశారు.

 

 

నోటుకు వోటు కేసులో ఇక కొట్టుకుంటారమో అన్నంతగా  తిట్టుకున్నకెసిఆర్, చంద్రబాబులను రాజీచేయడంలో కీలకపాత్ర వహించిన వెంకయ్య నాయయుడు  ఈ విషయంలో జోక్యం చేసుకోలేరా అని వారు వాదిస్తున్నారు.

 

ఇంత విజ్ఞత ఉన్న నాయకులు  ఇంటికి పిలిపించుకున్నోడిని ఒక్కమాట అనుకుండా పోయినోడిని నానా దుర్భాషలాడటమేమిటో?

 

అయితే, టిడిపిలో ఒక అనుమానం మొదలయింది.జగన్ నుచూపించి ప్రధాని మోదీ  చంద్రబాబాబును జడిపిస్తున్నాడా  అనేది ఈ అనుమానం.

 

మొదటి నుంచి ప్రధాని మోదీ చంద్రబాబును బారెడు దూరంలోనే ఉంచుతున్నారు. ఆయన పూర్వపు ‘కింగ్ మేకర్’ అని, ప్రధాని పదవిని రెండు సార్లు చిటికెన వేలుతో తీసి అవతల పడేసిన పెద్దమనిషి అని చూడటమే లేదు. ఎపుడో ఎదురుగా ఉన్నపుడు ముఖస్తుతి చేయడమే తప్ప, 7 ఆర్ సి ఆర్ లోని చల్ల ని వాతావరణంలో తీరిగ్గా కలుసుకుని తాపీగా  టీ తాగుతూ నాలుగుమాటలు మాట్లాడుకునే అవకాశం మోదీ ఎపుడూ చంద్రబాబుకివ్వలేదు. అమెరికాలో జనం నీరాజనం పడుతూ ఉంటే ఢిల్లీలో మోదీ మాట్లాడ్డానికి కూడా అవకాశ మివ్వడం లేదేమిటన్నది టిడిపి వాళ్ల బాధ.

 

ఎపుడూ గతం చూపి కాలక్షేపం చేసే ముఖ్యమంత్రికి ఇది ఇబ్బందిగా ఉంటుంది.

 

యునైటెడ్ ఫ్రంట్  రోజుల్లో గాని, పార్టీ మార్చి వాజ్ పేయి గారి ఎన్ డిఎ లోచేరినపుడు గాని ఢిలీలో చంద్రబాబు దక్కిన  వైభవం  అంతా ఇంతకాదు. ఢిల్లీలో  కాలు పెట్టినపుడు సిపిఎం నాయకుడు హరికిషన్ సూర్జిత్ చంద్రబాబు కోసం ఎపి భవన్ వచ్చేవాడు. జాతీయనేతలంతా ఎపి భవన్ వచ్చి బాబు దర్శనం చేసుకున్నవారే. ఢిల్లీలో అపుడు నెంబర్ హడావిడి ఎపి భవన్ ది, అంధ్రా సిఎందే.

 

చంద్రబాబు విమానం దిగాడంటే, అప్పటి ప్రధానివాజ్ పేయి పనులాపేసి ‘నాయుడు జీ’ కోసం ఎదురు చూసేవాడు. చంద్రబాబు బయటికెళ్తే పట్టుకోవడానికి ఎపి భవన్ బయట డజన్ల కొద్ది ఇంగ్లీష్ ప్రెస్సోళ్లు కాపలా కాస్తూ ఉండేవారు. ఇలాంటినాయుడి జీకి ఇపుడు ఢిల్లీలో ప్రధాని దర్శనం కాదు, నాటి గౌరవం లేదు. ఇపుడు సిబిఐ కేసుల్లో ఉన్నజగన్ కు మోదీ ఇచ్చిన మర్యాద చూస్తే వొళ్లు మండుతా ఉంది. అయితే, మోదీని ఏమనలేరు కాబట్టి, ప్రధాని పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తావా, ప్రజలకు చెప్పవా, ఏమ్మాట్లాడావో చెప్పాల, ఏంతాగావో చెప్పాలా ...జగన్ ని అడుగుతున్నారు.

 

ఈ చిన్న సమావేశంతో ఎందుకంత భయం?

 

‘భయంగానే ఉంటుంది. జగన్  తొలి నుంచి అమరావతి అవినీతి మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. పేరుమోసిన పర్యావరణ వేత్తలంతా ఇది రియల్ ఎస్టేట్ ప్రాజక్టు అనేశారు. పోలవరం కాంట్రాక్టులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బంధువుల కోసం  రాజధాని సమీపంలో భూదానోద్యమం... ఇలా ఒకటేమిటి... జగన్ ఈ చిట్టా అందించాడేమో నని భయం కావచ్చు. రాష్ట్రంలో అవినీతి ఎలా ఉందో చూపించే సమాచారం జగన్ ప్రధానిచేతికందించి ఉండవచ్చు. ఇది ప్రమాదకరం. ఈ చిట్టాతో ప్రభుత్వమేమీ కూలిపోదుగాని, అవతలి మనిషి చేతిలో ఇన్ని రహస్యాలుండటం మంచిది కాదు.’ వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి అన్నారు.

 

ఆంధ్రాబిజెపి నాయకులు హ్యాపీగా ఉన్నారు. ఇంతవరకు టిడిపి వాళ్ల తమనసలు పట్టించుకునేలేదని,రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించుకోనీయడం లేదని వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మహిళా నాయకులు పురందేశ్వరి ఆగ్రహం దీన్నుంచి వచ్చిందే. ఈ నెల  25వ తేదీన అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు.  అపుడు వారు జగన్ లెవదీసిని అవినీతి అంశాలన్నింటిని  గురించి షా ముందు పంచాయతి పెడుతున్నారు.

 

“మేం రెండు విషయాలను అమిత్ షా తో చర్చించాలనుకుంటున్నాం. ఇది టిడిపి బిజెపితో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించినది.1. రాష్ట్రంలో , పోలవరం తో పాటు జరిగిన ప్రాజక్టు కాంట్రాక్టుల్లో విపరీతంగా అవినీతి నడించింది. పోలవరం ఎగ్జిక్యూషన్ ను ఆంధ్ర కు ఇచ్చి తప్పుచేశారు. ఇది  ముఖ్యమంత్రి సొంతప్రాజక్టు అన్నట్లు చేయిస్తున్నాడు. పైనుంచి కింది దాకా అంతా టిడిపికాంట్రాక్టర్లే.  2. ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో బిజెపి ఎదగకుండా చేస్తున్నాడు. దీనికి కారణం 2019 నాటికి బిజెపి బలపడితే, ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది. అందువల్ల బిజెపి పూర్తిగా తన మీదే ఆధారపడి ఇక్కడ బతకాలి అనేది చంద్రబాబు ధోరణి.” అని బిజెపి ఉపాధ్యక్షులొకరు చెప్పారు.

 

ఈ పంచాయతీని అమిత్ షా ముందు పెట్టి, ఇక మీరే తేల్చంని అని అడగాలుకుంటున్నాం, అని ఆయన చెప్పారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios