అమేజాన్ 20-20 కార్నివాల్

Amazon Kicks Off Samsung 20-20 Carnival Sale, Offers Discounts on Galaxy A8+, Galaxy On7 Prime, and More
Highlights

ప్రతి వస్తువుపై రూ.5వేల వరకు డిస్కౌంట్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.శాంసంగ్ 20-20 కార్నివాల్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను తీసుకువచ్చింది. గెలాక్సీ సిరీస్‌లోని మొబైల్స్‌పై ఎంపిక చేసిన మోడల్స్‌లో రూ.5వేల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. బుధవారంతో ఆరంభమైన ఈ ప్రత్యేక సేల్ ఏప్రిల్ 21 వరకు కొనసాగనుంది. ఈ కార్నివాల్‌లో భాగంగా ఎక్స్ఛేంజ్, నో కాస్ట్-ఈఎంఐ సదుపాయాలను కూడా కల్పించింది. 

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వినియోగదారులకు 10శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వనుంది. ప్రతిరోజు 20 మంది లక్కీ విన్నర్లను ఎంపిక చేసి వారికి ముంబయి ఇండియన్స్ అఫీషియల్ జెర్సీని ప్రతి ఒక్కరికి అందజేయనున్నారు. స్మార్ట్‌ఫోన్లతో పాటు శాంసంగ్ ట్యాబ్‌లపై కూడా ప్రత్యేక రాయితీలు, జియో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. 
ఆఫర్లున్న కొన్ని మోడల్స్..
గెలాక్సీ ఏ8 ప్లస్: ధర రూ.29,990(అసలు ధర రూ.32,990)
గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్ 32 జీబీ: ధర రూ.10,990(అసలు ధర రూ. 12,990)
గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్ 64 జీబీ: ధర రూ.12,990(అసలు ధర రూ.14,990)
గెలాక్సీ ఆన్7 ప్రో: ధర రూ.6,990(అసలు ధర రూ.11,190)
గెలాక్సీ ఆన్5 ప్రో: ధర రూ.6,490(అసలు ధర రూ. 9,190)
గెలాక్సీ జే7 ఎన్‌ఎక్స్‌టీ 16 జీబీ: ధర రూ.9,490(అసలు ధర రూ.11,490)

loader