ఉత్తరప్రదేశ్ లో మలుపులు తిరుగుతున్న రాజకీయం పార్టీ పగ్గాలు అఖిలేష్ యాదవ్ చేతుల్లోకి

ఉత్తరప్రదేశ్ లో రాజకీయం మరింత వేడెక్కుతోంది. రోజుకో నాటకీయ పరిణామం చోటుచేసుకుంటోంది. పార్టీని గెలిపించి తనయుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టిన ములాయం ఇప్పుడు పార్టీ నుంచే దూరమైపోయారు.

సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్ నిన్న సీఎం అఖిలేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. తర్వాత రాజీకి వచ్చి తండ్రి కొడుకులు ఏకమైనట్లు ప్రకటన వచ్చింది. అయితే

పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో సీఎం అఖిలేష్ యాదవ్ సక్సెస్ అయ్యారు.

తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి పార్టీ పగ్గాలు లాగేసుకున్నారు. ఇప్పుడు ములాయంను పార్టీకి కేవలం మార్గదర్శిగా మాత్రమే ఉంచారు.

అలాగే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తన బాబాయి అయిన శివ్‌పాల్ యాదవ్‌ను కూడా అఖిలేష్ పార్టీ నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఉత్తమ్ నరేశ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. దీంతో నరేశ్ వర్గీయులు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.