Asianet News TeluguAsianet News Telugu

ఆకె రవికృష్ణ ఎక్కడ ఉన్నా సందడే...

బ్రహ్మాత్సవాలలో యాత్రికులను  ఇబ్బంది పెట్టకుండా టాక్సిల మీద నిఘా...

Ake Ravikrishna begins disciplining taxi drivers in Tirupati

ఐపిఎస్ ఆఫీసర్ ఆకె రవికృష్ణ ఎక్కడ ఉన్నా కలకలం సృష్టిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెలెన్స్ అధికారిగా రాక ముందు ఆయన కర్నూల్ ఎస్ పి గ ఉన్నారు. ఖాకి వేసుకుని , లాఠీ వూపుకుంటూ పోతే   ప్రజలకు దగ్గర కాలేమని ఆయన తెలుసు . అందుకే ఆయన ఎస్ పిగా కంటే ఎన్జీవో లాగా పనిచేసి అక్కడ జనంతో కలసిపోయారు. లాఠీ కంటే అవేర్ నెస్ క్యాంపెయిన్ కు ఆయన ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు.  చైల్డ్ అబ్యూజ్ కావచ్చు, ఫాక్షన్ కావచ్చు, పర్యావరణం కావచ్చు ఆయన వన్నీ క్యాంపెయిన్ లే. ఇపుడు తిరుపతిలో కూడా ఆయన టాక్సిడ్రయివర్ లను చైతన్యం వంతం చేసే క్యాంపెయిన్ ప్రారంభించారు. ఎందుకంటే, తిరుపతి ఇమేజ్ వారి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల సెప్టెంబర్   23 నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా టాక్సీ డ్రయివర్లు యాత్రికులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చర్యలు మొదలుపెట్టారు.  భక్తులంతా సుదూర ప్రాంతాలనుంచి వచ్చే వారు కాబట్టి, శ్రీవారి దర్శన అనంతరం వారంతా సంతృప్తిగా తిరిగివెళ్లాలనే లక్ష్యంతో   రవికృష్ణ  ఈ రోజు సెన్సిటైజేషన్ కార్యక్రమం మొదలుపెట్టారు.  భక్తుల  తిరుమలయాత్ర ఫలప్రదం కావాలంటే, స్థానికంగా వారి ప్రయాణాలు సుఖంగా సాగాలి.  రైల్వే స్టేషన్ లో లేదా బస్ స్టాండో లో దిగగానే ప్రయాణికులు మొదట వెదికేవ్యక్తి టాక్సి డ్రయివరే కాబట్టి తిరుపతి ప్రతిష్ట వారి మీద ఆధారపడిఉంటుందని ఆయన చెప్పారు.  దీనికోసం వారిని చైతన్యం పరిచే కార్యక్రమం రవికృష్ణ చేపట్టారు.తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు, ఆర్‌టిఏ అధికారులు కలిసి తిరుమల, తిరుపతి ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. వారికి ఆయన చేసిన సూచనలు:

1.    శ్రీవారి భక్తులను కుటుంబ సభ్యులుగా భావించి చక్కగా సేవలందించాలి.

2.    తిరుమల ఘాట్‌ రోడ్లలో నిబంధనలు పాటించి భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలి.

3.     డ్రైవర్లు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి, భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.

4.     ఘాట్‌ రోడ్లలో తప్పనిసరిగా వేగనియంత్రణ పాటించాలన్నారు. తిరుమల-తిరుపతి మధ్య నిర్దేశించిన సమయంలోనే వాహనాల రాకపోకలు సాగించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో కూడిన వస్త్రధారణ పాటించాలి.

5.    తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా డ్రైవర్లు ముందుగానే భక్తులకు అవగాహన కల్పించాలని, అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద తనిఖీలకు సహకరించాలి.

6.    నిబంధనలు అతిక్రమించిన డ్రైవర్లు, ఆపరేటర్లపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఉన్నాయని, డ్రైవర్ల నడవడికను పరిశీలిస్తుంటారు. 

7.    తిరుమలలో నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్‌ చేయాలి.

8.    బస్టాండు, రైల్వేస్టేషన్‌లో దిగిన భక్తులు మొదట కలుసుకునేది ట్యాక్సీల డ్రైవర్లనేనని, వారితో స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. భక్తులకు చక్కగా సేవలందిస్తే శ్రీవారి ఆశీస్సులు తప్పక ఉంటాయి.

9.    తిరుపతి-తిరుమల మధ్య పిల్లలకు రూ.30/-, పెద్దలకు రూ.60/- చొప్పున మాత్రమే ఛార్జీగా వసూలు చేయాలి. అంతకుముందు.

ఎంవిఐ శ్రీ సురేష్‌నాయుడు మాట్లాడుతూ ఘాట్‌ రోడ్లలో వాహనాల డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తిరుపతి అర్బన్ ఎస్ పి అభిషేక్ మహంతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   500 మందికిపైగా ట్యాక్సీ డ్రైవర్లు హాజరయ్యారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios